త్వరలో సబ్సిడీపై వ్యవసాయ పరికరాలు : నాగేశ్వరరావు

త్వరలో సబ్సిడీపై వ్యవసాయ పరికరాలు : నాగేశ్వరరావు
  • వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు

కల్వకుర్తి, వెలుగు: రైతులు తాము పండించిన వరి ధాన్యాన్ని ప్రభుత్వం నిర్దేశించిన నిబంధనల ప్రకారం కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు సూచించారు. శ్రీశైలం దర్శనానికి వెళ్లి తిరిగి వస్తుండగా, మార్గమధ్యలో వెల్దండ మండల కేంద్రంలో మంత్రి ప్రయాణిస్తున్న వాహనం పంక్చర్ అయ్యింది. దీంతో కారు రిపేర్ అయ్యేలోపు అక్కడే ఉన్న రైస్ మిల్లును ఆయన సందర్శించారు.

 కొనుగోలు కేంద్రాల్లో సమస్యలు ఉంటే రైతులు అధికారుల దృష్టికి తీసుకురావాలని సూచించారు. రైతులకు న్యాయం చేసేవిధంగా ధాన్యం కొనుగోలు చేయాలన్నారు. సాంకేతిక కారణాలతో రుణమాఫీ నిలిచిపోయిన రైతులందరికీ రుణమాఫీ చేసి తీరుతామన్నారు. త్వరలో రైతులందరికీ సబ్సిడీపై వ్యవసాయ పరికరాలు అందించనున్నట్లు మంత్రి పేర్కొన్నారు. కార్యక్రమంలో నాయకులు  కలీం, లక్ష్మణ్, ఆనంద్, కుమార్ తదితరులు ఉన్నారు.