మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పై మరోసారి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు ఖమ్మం కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి తుమ్మల నాగేశ్వరరావు. ఖమ్మం నగరంలోని 9, 10వ డివిజన్లలో తుమ్మల ఎన్నికల ప్రచారం నిర్వహించారు. మంత్రి పువ్వాడ కేసులు పెట్టించడంలో ఎవరిని వదల్లేదన్నారు. డాక్టర్లు మీటింగ్ పెట్టినా భూములు మంత్రి దోచుకున్నారని చెబుతున్నారని తెలిపారు. ఏదో ఒకరకంగా పీడించి , పిప్పిచేసి సొమ్ము చేసుకొని ఈరోజు మంత్రి పువ్వాడ నీతులు చెబుతున్నారని ఆరోపించారు.
నేను డాలర్ ని.. ఎక్కడైనా చెల్లుతా... పువ్వాడ రద్దు చేసిన 2 వేల రూపాయల నోటు అని కామెంట్స్ చేశారు తుమ్మల నాగేశ్వరరావు. పువ్వాడ మతి ఉండి మాట్లాడుతున్నారో లేక మాట్లాడుతున్నారో అర్థం కావటం లేదన్నారు. తాను ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఎక్కడి నుంచైనా పోటీ చేసి గెలుస్తానని, త్వరలో జరగబోయే ఎన్నికల్లో ఖమ్మం నుంచి గెలుస్తానంటూ ధీమా వ్యక్తం చేశారు.
Also read :- టికెట్ రాలేదనే బాధ లేదు.. సంపూర్ణ మద్దతు ఇస్తా : అద్దంకి దయాకర్