- కేసీఆర్ వైఖరి నచ్చకే కాంగ్రెస్ లో చేరా
- మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
- ఖమ్మంలో తెలంగాణ ఉద్యమకారుల ఆత్మీయ సమావేశం
ఖమ్మం : కాంగ్రెస్ అభ్యర్థి, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు మద్దతుగా తెలంగాణ తొలి, మలి దశ ఉద్యమ కారులు ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తుమ్మలతోపాటు ఉద్యమకారులు డాక్టర్ ఎంఎఫ్ గోపీనాథ్, డాక్టర్ కేవీ కృష్ణారావు, ఎర్నేని రామారావు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా తుమ్మల మాట్లాడుతూ తెలంగాణ తొలి, మలిదశ ఉద్యమకారులు తనకు సంఘీభావంగా తెలపడం మీ ఉద్యమ స్ఫూర్తికి నిదర్శనమన్నారు.
గోదావరి జలాలతో ఉమ్మడి ఖమ్మం జిల్లా సస్యశ్యామలం చేయడం కోసమే నాడు టీఆర్‌ఎస్ లో చేరానని, మోసకారీ నాటకాల స్వార్థపూరిత కేసీఆర్ ప్రభుత్వ వైఖరి నచ్చకే కాంగ్రెస్‌లో చేరానన్నారు. ఉద్యమకారులకు ఇంటి స్థలాల వాగ్దానం ఆరు గ్యారెంటీ పథకాల్లో ఉందన్నారు. కాంగ్రెస్ గెలుపు కోసం ఉద్యమకారులు కథం తొక్కడం సంతోషమని తుమ్మల నాగేశ్వరరావు అన్నారు.