ఖమ్మం టౌన్, వెలుగు : మంత్రి ఆశయాలు నెరవేరుస్తానని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. అసెంబ్లీ ఎన్నికలో తన గెలుపునకు కృషి చేసిన టీడీపీ కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు. సోమవారం జిల్లా టీడీపీ కార్యాలయానికి మంత్రి వెళ్లి కార్యకర్తలను కలిశారు. దివంగత నందమూరి తారకరామారావు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా తుమ్మల మాట్లాడుతూ తాను ఏపార్టీలో ఉన్నా ఎన్టీఆర్ సంక్షేమ రాజ్యం, ఆశయం కోసం పని చేస్తానని తెలిపారు.
టీడీపీ ఆఫీస్ స్థలాన్ని రెగ్యులైజ్ చేస్తామని హామీ ఇచ్చారు. అనంతరం ఖమ్మంలోని స్వర్ణభారతిలో కమ్మ సంఘం అధ్యక్షుడు ఎర్నీనేని రామారావు ఆధ్వర్యంలో ఆ సంఘం న్యూ ఇయర్ క్యాలండర్ ను ఆవిష్కరించారు. ఆయన వెంట మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీ నారాయణ, సాధు రమేశ్‌రెడ్డి, టీడీపీ పార్లమెంట్ ఇన్చార్జి కూరపాటి వెంకటేశ్వరరావు, కేతినేని హరీశ్, సీతయ్య, నల్లమల రంజిత్ పాల్గొన్నారు.