త్వరలో రైల్వే అండర్ బ్రిడ్జిని  ఉపయోగంలోకి తేవాలి : తుమ్మల నాగేశ్వర రావు

ఖమ్మం, వెలుగు: ఖమ్మంలోని సారథి నగర్ లో ఉన్న రైల్వే అండర్ బ్రిడ్జిని వెంటనే అందుబాటులోకి తేవాలని కలెక్టర్ గౌతమ్ ను మంత్రి తుమ్మల నాగేశ్వర రావు ఆదేశించారు. టీడీపీ హయాంలో తుమ్మల ఖమ్మం ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు  నిర్మాణం పూర్తైన సారథినగర్ రైల్వే అండర్ బ్రిడ్జి కొన్ని రాజకీయ కారణాలతో ఇప్పటికీ ప్రారంభానికి నోచుకోలేదు.

ఇప్పుడు తుమ్మల మళ్లీ ఖమ్మం ఎమ్మెల్యేగా, మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆ బ్రిడ్జిని వెంటనే ఉపయోగంలోకి తేవాలని ఆదేశాలు జారీ చేశారు. దీనిపై కలెక్టర్ సానుకూలంగా స్పందించి బ్రిడ్జిని త్వరలోనే అందుబాటులోకి తెస్తామని చెప్పారు.