అశ్వారావుపేట, దమ్మపేట మండలాల్లో తుమ్మల పర్యటన

అశ్వారావుపేట వెలుగు: అశ్వారావుపేట, దమ్మపేట ప్రాంతాలు భవిష్యత్తులో  హార్టికల్చర్​ హబ్​ గా మారుతాయని వ్యవసాయ శాఖామంత్రి తుమ్మల నాగేశ్వరరావుఅన్నారు.అశ్వారావుపేట పామాయిల్ ఫ్యాక్టరీ పవర్ ప్లాంట్ పనులను సోమవారం మంత్రి తుమ్మల పరిశీలించారు. అనంతరం రైతులతో,అధికారులతోమాట్లాడి, మీడియాతో మాట్లాడారు.రైతులు ఆర్థికంగానిలబడాలంటే ఒకే వ్యవసాయ క్షేత్రంలో మూడు, నాలుగు రకాల పంటలను సాగు చేయాలని సూచించారు.

ఇప్పటికే కొబ్బరి, జీడి వంటి ఉద్యాన పంటలతో పాటు కూరగాయల సాగు అత్యధికంగా సాగవుతుందని వివరించారు. ఉద్యాన తోటల్లో అంతర పంటల సాగు రైతుకు ఎంతో మేలు చేస్తుందనిన్నారు. కోకో, వక్క, జాజీ వంటి అంతర పంటల సాగు వైపు రైతులు ఆసక్తి చూపుటం మంచి విషయమన్నారు.పామాయిల్, కొబ్బరి తోటల్లో అనుకూలమైన అంతర పంటలను గుర్తించి రైతులను ఆ దశగా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రోత్సాహిస్తుందని చెప్పారు.

తాను రైతుల సంక్షేమానికి, వ్యవసాయాభివృద్ధికి అధిక ప్రాధాన్యతనిచ్చానని అన్నారు.భవిష్యత్ అవసరాల దృష్ట్యా పామాయిల్ ఫ్యాక్టరీలో రూ.30 కోట్లతో పవర్ ప్లాంట్​నునిర్మిస్తున్నట్లు తెలిపారు.ప్లాంట్​ను టైంలోగాపూర్తి చేస్తే రైతులకు,సంస్థకు మేలు కలుగుతుందని అధికారులను ఆదేశించానని అన్నారు.మంత్రి వెంట అయిల్ఫైడ్ జనరల్ మేనేజర్ టి.సుధాకర్రెడ్డి, డివిజనల్ ఆఫీసర్ ఆకుల బాలకృష్ణ, అప్పారావుపేట ఫ్యాక్టరీ మేనేజర్ కల్యాణ్, రైతు నాయకులు ఆలపాటి రామ్మోహనరావు, రామచంద్ర ప్రసాద్, బండి భాస్కర్, బత్తిన పార్ధసారధి, నార్లపాటి రాములు పాల్గొన్నారు.