ఆర్టీసీ కార్మికుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా : తుమ్మల నాగేశ్వరరావు

ఖమ్మం టౌన్, వెలుగు : కాంగ్రెస్  ప్రభుత్వం ఏర్పడ్డాక ఆర్టీసీ కార్మికుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఆ పార్టీ ఖమ్మం అభ్యర్థి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. నియోజకవర్గ పరిధిలోని పలు డివిజన్ల సభ్యులు రఘునాథ పాలెం మండలంలోని వేపకుంట్లలో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనాలు, రోడ్డు షోలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా తుమ్మల మాట్లాడుతూ ఆర్టీసీ కార్మికులను విలీనం చేయడంతో పాటు  పీఆర్సీలను చెల్లిస్తామని చెప్పారు. బస్సులను ఆధునికీకరణ చేసి కొత్త సర్వీస్ ప్రారంభించేందుకు కృషి చేశానని తెలిపారు. గోదావరి జలాలను పాలేరులో కలిపి రఘునాథ పాలెం మండలంను సస్యశ్యామలం చేస్తానన్నారు. మట్టి గుట్టలు, ఇసుక దందాతో ఖమ్మంలో మాఫియా రాజ్యమేలుతోందని ఆరోపించారు. దీనికి స్వస్తి పలికేందుకు తనను గెలించాలని కోరారు. 

బీఆర్ఎస్ కు ఓటు వేస్తే బీజేపీకి వేసినట్లే....

తుమ్మలతో పాటు ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్న సీపీఐ జాతీయ నాయకుడు నారాయణ మాట్లాడారు. బీఆర్ఎస్ కు ఓటు వేస్తే, బీజేపీకి ఓటు వేసినట్లేనని తెలిపారు. బీజేపీ పార్టీని వీడి వచ్చిన వివేక్ కాంగ్రెస్ పార్టీలో చేరిన పది రోజుల్లోనే వందల కోట్ల రూపాయలు దుర్వినియోగమైనట్లు ఐటీ దాడులు చేయడం దుర్మార్గమన్నారు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి నామినేషన్ వేసే రోజు ఐటీ దాడుల పేరిట అడ్డుకోవాలని చేసిన ప్రయత్నం హేయమైందన్నారు. తుమ్మలను గెలిపించాలని కోరారు. అభివృద్ధి కాంగ్రెస్​తోనే సాధ్యంఇల్లెందు, వెలుగు : అభివృద్ది కాంగ్రెస్​తోనే సాధ్యమని కాంగ్రెస్​ నాయకులు తుమ్మల తెలిపారు. నియోజకవర్గంలోని బయ్యారంలో కాంగ్రెస్​ అభ్యర్థి కోరం కనకయ్య ప్రచారంలో ఆయన పాల్గొన్నారు. కోరం గెలిస్తే చేపట్టబోయే పనులను వివరించారు.