- తలసేమియా బాధితుల కోసం రక్తదానం చేసిన అభిమానులు
ఖమ్మం, వెలుగు : మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కుమారుడు తుమ్మల యుగంధర్ పుట్టిన రోజు వేడుకలు ఖమ్మంలో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా బైపాస్ రోడ్డులోని సప్తపది ఫంక్షన్ హాల్లో తలసేమియా పేషెంట్ల కోసం తుమ్మల అభిమానులు ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని చిల్డ్రన్ స్పెషలిస్ట్ డాక్టర్ కూరపాటి ప్రదీప్ ప్రారంభించారు. అభిమానులు, కార్యకర్తలతో పాటు యుగంధర్ కూడా రక్తదానం చేశారు. భారీ కేక్‌ను కట్ చేశారు. ఈ సందర్భంగా యుగంధర్ మాట్లాడుతూ తన బర్త్ డే సందర్భంగా అభిమానంతో 500 మంది రక్తదానం చేయడం గర్వంగా ఉందన్నారు.
కార్యక్రమంలో నగర కాంగ్రెస్ అధ్యక్షుడు మహమ్మద్ జావేద్, కార్పొరేటర్లు కమర్తపు మురళి, మిక్కిలినేని మంజుల నరేందర్, రావూరి కరుణా సైదాబాబు, మలీదు జగన్, మలీదు వెంకటేశ్వర్లు, చంద్రకాని చంద్రం, జిల్లా కాంగ్రెస్ నాయకులు సాధు రమేశ్‌రెడ్డి, చావా నారాయణరావు, మహ్మద్ అష్రీఫ్, పోట్ల వీరేందర్, షేక్ అబ్దుల్ రషీద్, తుపాకుల యలగొండ స్వామి పాల్గొన్నారు.
కల్లురులో..
కల్లూరు : కల్లూరు మండల కాంగ్రెస్ పార్టీ శ్రేణుల ఆధ్వర్యంలో ఆదివారం యుగంధర్ పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు. పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్ద భారీ కేకు కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, ధారామారావు , ఏనుగు సత్యంబాబు, పసుమర్తి చందర్రావు, ధారా రంగా, బొల్లం రామారావు, జిల్లామైనార్టీ సెల్ జాయింట్ సెక్రటరీ షేక్ బాజీ, మట్టా రామకృష్టాగౌడ్, బొల్లం శంకర్, గౌడ్, బొల్లం ఉపేందర్, బొడ్డు తిరుపతిరావు, పరిమి భరత్, టీడీపీ నాయకులు కట్టా గోపాలరావు, పో ట్రు శ్రీనివాసరావు, పోట్రు సత్యం పాల్గొన్నారు.