కొట్టుకుపోయిన తుంగభద్ర డ్యామ్ గేటు.. 69 ఏండ్లలో ఇదే మొదటిసారి

కర్ణాటకలోని హోస్పేట్‌లో ఉన్న తుంగభద్ర డ్యామ్‌  గేటు భారీ వరదలకు శనివారం రాత్రి కొట్టుకుపోయింది. జలాశయానికి వరద తగ్గడంతో శనివారం రాత్రి 11 గంటల సమయంలో గేట్లను మూసివేస్తున్న క్రమంలో 19వ గేటు చైన్‌ లింక్‌ తెగి కొట్టుకుపోయింది. దీంతో గేట్ నుంచి 35 వేల క్యూసెక్కుల వరద నదిలోకి చేరుతున్నాయి. డ్యాం నీటి నిల్వ మేటెనెన్స్ చేసే టైంలో ఈ ఘటన చోటుచేసుకుందని అధికారులు తెలిపారు.  

ప్రాజెక్టు నుంచి 60 టీఎంసీల నీళ్లు బయటికి వదిలిన తర్వాతే గేటు పునరుద్ధరణ పనులు చేపడతామని తెలిపారు. దీంతో ప్రస్తుతం 33 గేట్లు తెరిచి నీటిని కిందికి వదులుతున్నామన్నారు. ఆ తర్వాత వరద నీరంతా కర్నూలు మీదుగా కృష్ణా నదిలో కలిసి శ్రీశైలం రిజర్వాయర్‌లో కి చేరుకుంటుంది. డ్యామ్‌ భద్రతకు సంబంధించి ఇంత పెద్ద ఘటన జరగడం గత 70 ఏండ్లలో ఇదే మొదటిసారి. 

తుంగభద్ర డ్యామ్‌ను కర్నాటక మంత్రి శివరాజ్ పరిశీలించారు. డ్యామ్‌ పరిస్థితిపై అధికారులతో మంత్రి సమీక్షించారు. తుంగభద్ర డ్యామ్ గేట్లు ఎత్తడంతో కర్నూలు జిల్లా పరిధిలోని ఆర్డీఎస్ దగ్గర తుంగభద్రా నది ఉధృతంగా ప్రవహిస్తోంది. మంత్రాలయం దగ్గర గేట్టు పెట్టి నదిలోకి ఈతకు వెళ్లకుండా హెచ్చరికలు జారీ చేశారు.