బీఆర్​ఎస్​ లీడర్లంతా కాంగ్రెస్​లోకి వస్తారు : సామేలు

తుంగతుర్తి, వెలుగు: పార్లమెంట్ ఎన్నికలలోపు  బీఆర్ఎస్  ముఖ్య నేతలంతా కాంగ్రెస్  లో చేరుతారని తుంగతుర్తి ఎమ్మెల్యే  మందుల సామేలు అన్నారు.     పార్లమెంటు ఎన్నికల్లో 14 స్థానాలు గెలుస్తామన్నారు. సూర్యాపేట జిల్లా తుంగతుర్తిలో రూ. 72 లక్షలతో నిర్మించిన  వ్యవసాయ శాఖ కార్యాలయాన్ని ఆయన సోమవారం   ప్రారంభించారు.    రేవంత్ రెడ్డి మీద తప్పుడు ఆరోపణలు చేస్తే సహించేది లేదని అన్నారు.  

కేటీఆర్ మతిభ్రమించి మాట్లాడుతున్నారని, కేటీఆర్ ను సీఎం  చేస్తానని కేసీఆర్ ముందే చెబితే కనీసం 9 స్థానాలు కూడా వచ్చేవికావన్నారు.   పేదల  అభ్యున్నతిసీఎం   రేవంత్ రెడ్డి తోనే సాధ్యమని సామేలు అన్నారు.  రైతుల పండించిన ధాన్యాన్ని వ్యవసాయ శాఖ ద్వారా కొనుగోలు చేసి  రైతుకు భరోసా కల్పిస్తామన్నారు.శాలిగౌరారంలో  ఉపేందర్ కుమార్తె వివాహానికి హాజరై రూ.  రెండు లక్షల  ఆర్థిక సాయం అందించారు. కార్యక్రమంలో వ్యవసాయశాఖ అధికారులు, కాంగ్రెస్​ నాయకులు పాల్గొన్నారు.

ALSO READ : ప్రజావాణి ఫిర్యాదులను త్వరగా పరిష్కరించాలి : ప్రియాంక అల