ఎమ్మెల్యే గ్యాదరి కిశోర్​కు హైకోర్టులో చుక్కెదురు

తుంగతుర్తి, వెలుగు : ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో అధికార బీఆర్ఎస్ పార్టీ నేతలకు కోర్డుల్లో వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. తాజాగా తుంగతుర్తి ఎమ్మెల్యే గ్యాదరి కిశోర్ కు తెలంగాణ హైకోర్టులో షాక్ తగిలింది. ఎన్నిక వివాదం కేసులో ఎమ్మెల్యే గ్యాదరి కిశోర్ దాఖలు చేసిన కౌంటర్ పిటిషన్ ను హైకోర్టు కొట్టేసింది. కిశోర్ ఎన్నిక చెల్లదని కాంగ్రెస్ ప్రత్యర్థి అద్దంకి దయాకర్ తెలంగాణ హైకోర్టులో పిటిషన్ వేశారు. 

అద్దంకి దయాకర్ దాఖలు చేసిన పిటిషన్ ను కొట్టేయాలని కిశోర్ కౌంటర్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై మంగళవారం విచారణ చేపట్టిన హైకోర్టు కిశోర్​వేసిన కౌంటర్ పిటిషన్ ను డిస్మిస్ చేసింది. ఎన్నికల ఫలితాలు, కౌంటింగ్ వీడియో ఫుటేజీ ఇవ్వాలని జిల్లా కలెక్టర్ కు హైకోర్టు సమన్లు జారీ చేసింది. ఈ కేసు తదుపరి విచారణను కోర్టు అక్టోబర్ 3కు వాయిదా వేసింది.