తునీషా కేసు.. షీజన్కు కస్టడీ పొడగింపు

తునీషా కేసు.. షీజన్కు కస్టడీ పొడగింపు

సీరియల్ నటి తునీషా మృతి కేసులో నిందితుడు షీజన్ ఖాన్ కు కోర్టు మరో రెండు రోజుల కస్టడీ పొడగించింది. ఇవాళ్టితో షీజన్ కస్టడీ ముగియటంతో పోలీసులు అతన్ని ముంబైలోని వసాయ్ కోర్టులో హాజరుపరిచారు. పోలీసుల అభ్యర్థన మేరకు న్యాయమూర్తి నిందితుడి కస్టడీని ఈ నెల 30 వరకు పొగడించారు.

బ్రేకప్ కారణంగానే తునీషా ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. శ్రద్దావాకర్ హత్య కేసు పరిణామాలు చూసే తునీషాకు బ్రేకప్ చెప్పానని విచారణలో నిందితుడు తెలిపాడు. కోర్టు ఉత్తర్వుల నేపథ్యంలో మరోసారి షీజన్ ను కస్టడీలోకి తీసుకోనున్న పోలీసులు అతని నుంచి మరిన్ని వివరాలు రాబట్టనున్నారు.