జమ్మూకశ్మీర్ లోని సాంబా ప్రాంతంలో భారీగా మోహరించారు పోలీసులు. సాంబా దగ్గర సరిహద్దుల్లోని ఫెన్సింగ్ సమీపంలో టన్నెల్ గుర్తించారు అధికారులు. పాక్ భూభాగం నుంచి టన్నెల్ ఉండటంతో.. విచారణ చేపట్టారు పోలీసులు. పాక్ నుంచి ఇద్దరు ఉగ్రవాదులను హతమార్చిన తర్వాత సొరంగాన్ని గుర్తించామన్నారు జమ్మూ పోలీసులు.
పాకిస్థాన్ సరిహద్దుకు అత్యంత సమీపంలోనే ఉన్న కారణంగా బలగాలు అప్రమత్తమయ్యాయి. ఇటీవల ఇద్దరు జైషే మహ్మద్ సూసైడ్ బాంబర్లు.. ఈ సొరంగం గుండానే భారత్లోకి చొరబడినట్లు అధికారులు భావిస్తున్నారు. పాక్ నుంచి సొరంగం దాదాపు 150 మీటర్ల పొడవు ఉంటుందని అంచనా వేస్తున్నారు. జమ్ముకశ్మీర్ సాంబాలోని అంతర్జాతీయ సరిహద్దు వెంబడి.. భారీ సొరంగాన్ని గుర్తించింది సరిహద్దు భద్రతా దళం(బీఎస్ఎఫ్). పాకిస్థాన్ జైషే మహ్మద్ ఉగ్రముఠాకు చెందిన ఇద్దరు సూసైడ్ బాంబర్లు దీనిగుండా భారత్లోకి చొరబడినట్లు అనుమానిస్తున్నారు అధికారులు. అమర్నాథ్ యాత్రకు అంతరాయం కలిగించేందుకు పాక్ ముష్కరుల కుట్రలో భాగంగానే సొరంగం తవ్వారని భావిస్తున్నారు. ఇటీవలే తవ్విన ఈ సొరంగం.. పాక్ వైపు నుంచి దాదాపు 150 మీటర్ల పొడవు ఉంటుందని అంచనా వేస్తున్నారు.
Jammu & Kashmir | Security forces deployed after a small opening, suspected to be a tunnel, was found in the general area near fencing in the Samba area, yesterday. pic.twitter.com/C0bDfc0lH3
— ANI (@ANI) May 5, 2022