నమ్మలేని నిజం : టప్పర్ వేర్ కంపెనీ దివాళా తీసింది

నమ్మలేని నిజం : టప్పర్ వేర్ కంపెనీ దివాళా తీసింది

టప్పర్ వేర్..ఈ డబ్బాలు లేని ఇల్లు లేదు..టప్పర్ వేర్ కంపెనీ తెలియని మమ్మీ లేదు..డాడీ లేడు..పొద్దు పొద్దున ఆఫీసులకు వెళ్లే మగాళ్లకు..స్కూల్ కు వెళ్లే పిల్లలకు..టిఫిన్ నుంచి లంచ్ వరకు బాక్సులు పెట్టేది ఈ టప్పర్ వేర్ లోనే..అసలు ఈ టప్పర్ వేర్ వచ్చిన తర్వాత గిన్నెల బాధ తప్పింది తల్లులకు. ఆన్ లైన్ లో మొదలయ్యి..ఆఫ్ లైన్ స్టోర్స్ వరకు విస్తరించింది కంపెనీ..టప్పర్ వేర్ డబ్బాలు లేని సిటీ ఇంటిని ఊహించుకోవటం కష్టం..అంత పెద్ద మార్కెట్ ఉన్న టప్పర్ వేర్ కంపెనీ దివాళా తీసింది..అవును..నమ్మలేని నిజం ఇది..దివాళా పిటీషన్ దాఖలు చేసింది టప్పర్ వేర్ కంపెనీ..

ఐకానిక్ కిచెన్‌వేర్ ఉత్పత్తులకు ప్రసిద్ధి చెందిన US కు చెందిన Tupperware Brands Corp కంపెనీ దివాలా తీసింది. ఇప్పుడు ఈ న్యూస్ ప్రతి తల్లికి నేషనల్ ఎమర్జెన్సీ లాంటిది. టప్పర్ వేర్ కంపెనీ తన బ్రాండ్ ఉత్పత్తులతో ప్రతి తల్లికి ఇష్టమైనదిగా మారింది. 

అమ్మలు కన్న బిడ్డ పుట్టిన రోజు అయినా మర్చిపోతారేమో గానీ..టప్పర్‌వేర్ డబ్బాను ఎప్పుడు కొన్నారు.. ఎవరికి అరువుగా ఇచ్చారు వంటి విషయాలను గుర్తుపెట్టుకుంటున్నారని అప్పట్లో టాక్ వచ్చింది. అంతలా ఈ టప్పర్ వేర్ కంపెనీల పాపులర్ అయింది. అలాంటి టప్పర్ వేర్ కంపెనీ ఇప్పుడు ఆర్థిక నష్టాలతో దివాలా తీసింది.

Also Read :- వావ్​.. అద్భుతం.. కొత్త బ్రెయిన్ను తయారు చేశారు.

అయితే టప్పర్ వేర్ కంపెనీ దివాళా పై సోషల్ మీడియాలో నెటిజన్లు మీమ్స్, కామెంట్లతో స్పందిస్తున్నారు. నహీ.. హే మాతాజీ అంటూ మహిళలు అరుస్తున్న మీమ్స్ తో హల్ చల్ చేస్తున్నారు. 

ఇక నెటిజన్ల కామెంట్లు అయితే భలే సరదాగా ఉన్నాయి. ఓ నెటిజన్ స్పందిస్తూ.. టప్పర్ కంపెనీ దివాళా తీయడానికి కారణంగా భారతీయ తల్లులే.. వాళ్లే బాధ్యత వహించాలి.. ఎందుకంటే వారి పిల్లలను ఒక్క డబ్బా కూడా మర్చిపోకుండా జాగ్రత్తపడ్డారు.. అందుకే అమ్మకాలు తగ్గాయి. అని రాశారు. 

మరో నెటిజన్ స్పందిస్తూ.. నేను తల్లులకోసం ప్రార్థిస్తున్నాను.. ఎందుకంటే టప్పర్ కంపెనీలు దివాళాలో ఎంతో బాధలో ఉన్నారు. అని రాశారు. 
ఏదీ ఏమైనా డాడీ, మమ్మీ, విద్యార్థులు ఇలా అందరికి చేరువైన టప్పర్ వేర్ కంపెనీ దివాళా చాలా బాధాకరమైన విషయమే అంటున్నారు మరికొందరు నెటిజన్లు.