భూతలంపై దాడులు చేయగల దీర్ఘశ్రేణి క్రూజ్ క్షిపణి లాంగ్ రేంజ్ ల్యాండ్ అటాక్ క్రూయిజ్ మిస్సైల్ (ఎల్‌ఆర్‌ఎల్‌ఏసీఎం)ను ఒడిశా తీరంలోని ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ నుంచి డీఆర్డీవో తొలిసారిగా పరీక్షించింది. ఎల్ఆర్ఎల్ఏసీఎంను బెంగళూరులోని ఏరోనాటికల్ డెవలప్మెంట్ ఏజెన్సీ అభివృద్ధి చేసింది. డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ (డీఆర్డీఓ)కు చెందిన పలు ల్యాబ్‌లు, ప్రైవేట్ పరిశ్రమలు దీని రూపకల్పనలో పాలుపంచుకున్నాయి.
డెవలప్మెంట్ కమ్ ప్రొడక్షన్ పార్టనర్లు
ఈ క్షిపణి ఉత్పత్తి బాధ్యతను హైదరాబాద్‌లోని భారత్ డైనమిక్స్ లిమిటెడ్, బెంగళూరులోని భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ సంస్థలు చేపట్టాయి. ఎల్‌ఆర్‌ఎల్‌ఏసీఎం అనేది డిఫెన్స్ అక్విజిన్ కౌన్సిల్ ఆమోదించిన మిషన్ మోడ్ ప్రాజెక్ట్.
ఇది మొబైల్ ఆర్టిక్యులేటెడ్ లాంచర్‌ను ఉపయోగించి భూమి నుంచి యూనివర్సల్ వర్టికల్ లాంచ్ మాడ్యుల్ సిస్టమ్‌ను ఉపయోగించి ఫ్రంట్‌లైన్ షిప్‌ల నుంచి ప్రయోగించేలా కాన్ఫిగర్ చేశారు.