విమానంలో అల్లకల్లోలం.. సీట్లలోని వారు లగేజీ బాక్సుల్లోకి ఎగిరిపడ్డారు..!

విమానంలో అల్లకల్లోలం.. సీట్లలోని వారు లగేజీ బాక్సుల్లోకి ఎగిరిపడ్డారు..!

విమానం.. గాల్లో ఎగురుతూ నిమిషాల్లో గమ్యస్థానాలను చేర్చుతుంది. అలాంటి విమానాల్లో ఇటీవల వరస ఘటనలు హడలెత్తిస్తున్నాయి. ఎయిర్ యూరప్ ఫ్లయిట్.. స్పెయిన్ లోని మాడ్రిడ్ నుంచి ఉరుగ్వే వెళుతుంది. గాల్లో ఉండగానే.. విమానం భారీ కుదుపులకు గురైంది. బ్యాలెన్స్ తప్పి.. అటూ ఇటూ ఊగిపోయింది. దీంతో విమానంలోని ప్రయాణికులు ఎగిరి ఎగిరి పడ్డారు. కొంతమంది ప్రయాణికులు తమ సీట్ల నుంచి ఎగిరి.. లగేజీ బాక్సుల్లో పడ్డారు. 30 మంది ప్రయాణికులు గాయపడ్డారు. లగేజీ బాక్సుల్లో పడిన ప్రయాణికులు కిందకు దిగుతున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

విమానంలో అల్లకల్లోలం కారణంగా.. ఉరుగ్వే వెళ్లాల్సిన ఫ్లయిట్ ను దారి మళ్లించి.. బ్రెజిల్ లో అత్యవసరంగా ల్యాండ్ చేశారు పైలెట్లు. విమానం ఒక్కసారిగా.. క్షణాల్లోనే వేగంగా కిందకు దిగిందని.. ఆ వెంటనే మళ్లీ అత్యంత వేగంగా పైకి లేచిందని.. అటూ ఇటూ ఊగిపోయిందని ప్రయాణికులు చెబుతున్నారు. విమానంలో అల్లకల్లోలం అయిన సమయంలో సీటు బెల్ట్ లేనివారు బ్యాలెన్స్ తప్పి ప్లయిట్ లోని పైభాగానికి ఢీకొన్నారని.. విమానంలోని ప్రయాణికులు వెల్లడించారు. 

ప్రమాదానికి కారణాలు ఏంటీ అనేది స్పష్టం చేయలేదు ఎయిర్ యూరప్ సంస్థ. సాంకేతిక కారణాల వల్లే ఇలా జరిగిందని చెబుతున్నారు. బ్రెజిల్ లో విమానం మాత్రం సురక్షితంగా.. ఎలాంటి ఇబ్బంది లేకుండా ల్యాండ్ అయ్యిందని.. గాయపడిన 30 మంది ప్రయాణికులకు చికిత్స అందిస్తున్నట్లు ఎయిర్ పోర్ట్ అథారిటీ వెల్లడించింది.