పేరు మార్చుకున్న దేశం

టర్కీని ఇక నుంచి తుర్కియా (Türkiye)గా పిలవాల్సి ఉంటుంది. తమ దేశం పేరు మార్చాలని ఐక్యరాజ్య సమితిని టర్కీ కోరింది. దీనికి ఐరాస అంగీకారం తెలిపింది. తక్షణమే మార్పు అమల్లోకి వస్తుందని యూఎన్ చీఫ్ ప్రకటించారు. పేరును మార్చాలంటూ.. ఆ దేశాధ్యక్షులు రెచప్ తయ్యప్ ఎర్దోవాన్ పలు ప్రయత్నాలు చేశారు. ప్రముఖ అంతర్జాతీయ సంస్థలను ఆయన ఆశ్రయించారు. తుర్కియా అనే పదం దేశానికి చక్కగా సరిపోతుందని.. ఎందుకంటే.. తుర్కుల సంస్కృతి, సంప్రదాయాలు, నాగరికత, విలువలకు అద్దం పడుతుందని ఎర్జోవాన్ చెబుతూ వస్తున్నారు. టర్కీ అనే పదాలకు ఎవో అర్థాలు ఉన, ఓ పక్షి పేరు కూడా టర్కీ అని ఉండడం, అనేక అర్థాలు ఇంగ్లీషులో ఉన్నాయని అందుకే పేరు మార్చాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.

పేరు మార్చడం వల్ల దేశ బ్రాండ్ మరింత పెరుతుందనే ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ దేశం నుంచి ఎగుమతులయ్యే ప్రొడక్టులపై మేడ్ ఇన్ తుర్కియా అని మారుస్తారు. గత జనవరిలో హెలో తుర్కియా పేరిట ప్రత్యేక కార్యక్రమం నిర్వహించినట్లు సమాచారం. అయితే.. పేరు మార్చడంపై సోషల్ మీడియాలో నెటిజన్లు స్పందిస్తున్నారు. ప్రభుత్వ అధికారులు మద్దతు తెలియచేస్తుండగా.. వచ్చే సంవత్సరం ఎన్నికలు జరగాల్సి ఉండడంతో ప్రజల దృష్టిని మళ్లించేందుకు చర్యలు తీసుకుంటున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి. దేశాలు ఇలా పేర్లు మార్చుకోవడం కొత్తేమీ కాదు. గతంలో కూడా పలు దేశాలు పేర్లను మార్చుకున్నాయి. మాసిడోనియా తమ పేరును నార్త్ మాసిడోనియాగా,. 2018లో స్వాజిలాండ్ ఈ స్వాటినిగా పేరు మార్చుకుంది. ఇరాన్ పేరు గతంలో పర్షియా, థాయ్ లాండ్ పేరు సియాంగా ఉండేది.

మరిన్ని వార్తల కోసం : -

బాలి ఫొటోగ్రాఫర్ సాహసం


ఉక్రెయిన్‌‌లో 20 శాతం రష్యా ఆధీనంలో