- ప్రాంగణమంతా జయజయ నినాదాలు
- ఓపెన్టాప్జీప్లో అభివాదం చేస్తూ వేదిక వద్దకు ప్రధాని
నిజామాబాద్, వెలుగు : ఇందూరు గడ్డ మీద మంగళవారం జరిగిన ప్రధానమంత్రి నరేంద్రమోదీ జన గర్జన సభకు పసుపు రైతులు భారీగా తరలివచ్చారు. ఉమ్మడి నిజామాబాద్, కామారెడ్డి, జగిత్యాల జిల్లాల నుంచి వచ్చిన పసుపు రైతులతో ప్రాగంణమంతా పసుపుమయమైంది. సొంతంగా వెహికల్స్ఏర్పాటు చేసుకొని మరి మోదీ సమావేశానికి అటెండయ్యారు. వారి దశాబ్దాల కోరిక అయిన పసుపు బోర్డును ప్రధాని పాలమూరు వేదికగా ప్రకటించిన నేపథ్యంలో ధన్యవాదాలు తెలపడానికి అధిక సంఖ్యలో వరుసకట్టారు.
12 గంటల తర్వాత సభ ఏర్పాటు చేసిన గ్రౌండ్లోకి ఎస్పీజీ పోలీసులు ప్రజలను అనుమతించారు. జిల్లాలోని ప్రతీ విలేజ్‌నుంచి పది చొప్పున బస్సులు, పది వ్యాన్లలో ప్రజలు సభకు తరలివచ్చారు. మహిళలు అధిక సంఖ్యలో రావడం విశేషం. బీజేపీ లీడర్లు అంచనా వేసిన దానికంటే రెండింతల జనం కనిపించారు. ప్రాంగణంలో ఏర్పాటు చేసిన కుర్చీలు సరిపోక వేలాది సంఖ్యలో ప్రజలు బయటే ఉండిపోయారు. జనాన్ని కంట్రోల్చేయడానికి పోలీసులు శ్రమించారు. సభ ముగిసేదాకా ప్రజలు ఓపికతో నాయకుల ప్రసంగాలు విన్నారు
మోదీ వెళ్లేదాకా హెలికాప్టర్చక్కర్లు..
ప్రధాని మోదీ ప్రయాణించిన హెలిక్యాప్టర్సరిగ్గా మధ్యాహ్నం 3.50 గంటలకు దిగింది. మరో రెండు హెలిక్యాప్టర్లు వెంట వచ్చాయి. 4 గంటలకు రూ.8,000 కోట్ల విలువైన పనులను ప్రారంభించారు. ఎన్టీపీసీ ఆధ్వర్యంలోని 800 మెగావాట్ల విద్యుత్ప్రాజెక్టు, బస్తీ దవాఖానాలు, క్రిటికల్ కేర్సెంటర్లు, సిద్దిపేట–సికింద్రాబాద్ రైలును వర్చువల్‌గా ప్రారంభించారు. ఇందుకోసం టెంట్వేరుగా వేశారు. 4.20 గంటలకు ప్రధాని మోదీ అక్కడ అయిదు నిమిషాలు ప్రసంగించి వేదిక వైపు ఓపెన్‌టాప్ జీపులో వచ్చారు.
ప్రజలు రెండు వైపులా పూలవర్షం కురిపించగా రెండు చేతులతో వారికి అభివాదం తెలుపుతూ ముందుకు సాగారు. యువత మోదీ.. మోదీ.. నినాదాలతో హోరెత్తించారు. ఆయన కూడా హుషారుగా ముందుకు కదిలి ప్రజలకు అభివాదం చేశారు. వేదిక పైకి వచ్చిన మోదీకి గ్రౌండ్‌లోని ప్రజలంతా లేచి చప్పట్లతో సంతోషాన్ని వ్యక్తం చేయగా, మోదీ తలకిందకు వంచి వినమ్రంగా ప్రతి నమస్కారం చేశారు. 4.56 గంటలకు ఆయన ప్రసంగం మొదలై 5.38 గంటలకు ముగిసింది. మోదీ సభా ప్రాంగణంలో ఉన్నంతసేపు పైన ఆకాశంలో ఆయన భద్రతను పర్యవేక్షించే హెలికాప్టర్చక్కర్లు కొట్టింది. ‘నా ప్రియమైన కుటుంబ సభ్యురాలా...’ అని సంబోధించి ప్రసంగం షురూ చేశారు.
ప్రధాని మోదీతో గవర్నర్ తమిళసై
ప్రధాని మోదీతో కలిసి రాష్ట్ర గవర్నర్ తమిళసై ప్రారంభోత్సవ వేడుకలో పాల్గొన్నారు. ఎన్టీపీసీ విద్యుత్ ప్రాజెక్టుతో పాటు బస్తీ దవాఖానాలు, క్రిటికల్ కేర్ సెంటర్లు, సిద్దిపేట–- సికింద్రాబాద్ కొత్త రైలుకు మోదీ పచ్చ జెండా ఊపి వర్చువల్ పద్ధతిలో ప్రారంభించారు. ఇవన్నీ అఫీషియల్ ప్రొగ్రామ్స్ కాగా అవి ముగిసేదాకా ఉన్న గవర్నర్, అక్కడి నుంచే వెళ్లిపోయారు. బీజేపీ ఏర్పాటు చేసిన సభా మైదానానికి మోదీ ఒక్కరే వచ్చారు.