మెట్‌పల్లి, వెలుగు: పసుపు వ్యాపారులు సిండికేట్ అయ్యి రేటు తగ్గిస్తున్నారని ఆరోపిస్తూ పలువురు రైతులు మెట్‌పల్లి మార్కెట్‌లో బుధవారం ఆందోళన చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పసుపు పంటకు రూ.15 వేలు మద్దతు ధర ప్రకటించాలని డిమాండ్ చేశారు. నిజామాబాద్, సాంగ్లి మార్కెట్లలో రూ.18 వేల నుంచి రూ.20 వేలు వరకు పలుకుతుండగా స్థానిక వ్యాపారులు సిండికేట్ అయి రేట్లు తగ్గిస్తున్నారని మండిపడ్డారు.
కార్యక్రమంలో రైతు సంఘం నాయకులు మామిడి నారాయణ రెడ్డి, బద్దం శ్రీనివాస్ రెడ్డి, గురిజల రాజారెడ్డి, పాపన్న, నర్సారెడ్డి, గంగారాం, రాజన్న, ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.