జిల్లాలో పసుపు కోతలు మొదలయ్యాయి. మొక్కలను తొలగించి పసుపు కొమ్ములను తవ్వి తీస్తున్నారు. పసుపును స్టీమ్ చేసి ఎండ బెట్టడం ప్రారంభమైంది. ఎండిన కొమ్ములను డ్రమ్ములో వేసి పాలిష్ చేస్తున్నారు. ఆర్మూర్ డివిజన్ తోపాటు మెట్పల్లి, నిర్మల్ ఏరియాల్లో పసుపు సాగు ఎక్కువగా జరుగుతుంది. ప్రస్తుతం మోర్తాడ్, కమ్మర్పల్లి మండలాల్లో కోతలు జోరుగా సాగుతున్నాయి.
కొన్ని గ్రామాల నుంచి ఇప్పటికే పసుపు మార్కెట్కు వస్తోంది. ప్రస్తుతం క్వింటాలుకు రూ 10 వేల వరకు పలుకుతోంది. వారం పదిరోజుల్లో మార్కెట్ పుంజుకుంటుందని, అప్పుడే మంచి రేటు వస్తుందని రైతులు చెప్తున్నారు. గత సీజన్లో క్వింటాలుకు రూ. 18 వేల వరకు రేటు పలికింది. ప్రస్తుతం బోర్డు ఏర్పడడంతో గతంలోకన్నా మంచి రేటు వస్తుందని రైతులు ఆశిస్తున్నారు. - వెలుగు ఫొటోగ్రాఫర్, నిజామాబాద్