మెట్‌‌‌‌పల్లి మార్కెట్‌‌‌‌లో పసుపు క్వింటాల్​కు రూ.15 వేలు

మెట్‌‌‌‌పల్లి మార్కెట్‌‌‌‌లో పసుపు క్వింటాల్​కు రూ.15 వేలు

మెట్పల్లి, వెలుగు: జగిత్యాల జిల్లా మెట్‌‌‌‌పల్లి మార్కెట్‌‌‌‌లో మంగళవారం పసుపు రికార్డు ధర పలికింది. క్వింటాల్​కు రూ.15 వేలు ధర రావడంతో పసుపు రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మెట్‌‌‌‌పల్లి మార్కెట్‌‌‌‌కు ప్రతి రోజూ 2 వేల నుంచి 3 వేల క్వింటాళ్ల పసుపు పంట వస్తోంది. ఈ ఏడాది రూ.6 వేలతో ప్రారంభమై రూ.10 వేల వరకు పలికింది. మంగళవారం ఏకంగా రూ.15 వేలకు చేరడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సాగు విస్తీర్ణం, దిగుబడి తగ్గడం వల్లే పసుపునకు డిమాండ్‌‌‌‌  పెరిగినట్లు మార్కెట్‌‌‌‌  వర్గాలు చెబుతున్నాయి. గతంలో జగిత్యాల జిల్లాలో 35 వేల ఎకరాల్లో పసుపు సాగవగా,  ప్రస్తుతం 18 వేల ఎకరాలకు సాగు విస్తీర్ణం పడిపోయింది. దీనికితోడు తెగుళ్లు సోకి దిగుబడి సైతం తగ్గింది.