మెట్‌‌పల్లిలో క్వింటాల్‌‌ పసుపు రూ. 16,001

మెట్‌‌పల్లిలో క్వింటాల్‌‌ పసుపు రూ. 16,001
  • వరంగల్‌‌లో పత్తికి పెరుగుతున్న ధర

మెట్‌‌పల్లి, వెలుగు : జగిత్యాల జిల్లా మెట్‌‌పల్లి మార్కెట్‌‌లో మంగళవారం క్వింటాల్‌‌ పసుపు రూ. 16,001 పలికింది. ఇబ్రహీంపట్నానికి చెందిన రైతు గడ్డం చిన్నయ్య రెండు బ్యాగుల పసుపును మార్కెట్‌‌కు తీసుకొచ్చాడు. క్వింటాల్‌‌ రూ. 16 వేలు పలకడంతో రైతు సంతోషం వ్యక్తం చేశాడు. మెట్‌‌పల్లి మార్కెట్‌‌లో మంగళవారం 738 క్వింటాళ్ల పసుపు అమ్మకానికి వచ్చింది. ఈ సీజన్‌‌లో మొత్తం 48,826 క్వింటాళ్ల పసుపు అమ్మకాలు జరిగాయని మార్కెట్‌‌ ఆఫీసర్లు చెప్పారు. 

వరంగల్‌‌లో పెరిగిన పత్తి ధర

వరంగల్‌‌ సిటీ, వెలుగు : వరంగల్‌‌ ఏనుమాముల మార్కెట్‌‌లో పత్తి ధర క్రమంగా పుంజుకుంటోంది. నాలుగు నెలల కింద క్వింటాల్‌‌ పత్తికి రూ. 6,950 ధర రాగా తాజాగా రూ. 7,560 పలికింది. దీంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మంగళవారం మార్కెట్‌‌కు 250 బస్తాల పత్తిని మార్కెట్‌‌కు తీసుకొచ్చారు. ప్రభుత్వం క్వింటాల్‌‌ పత్తికి రూ. 7,521 మద్దతు ధర ఇస్తుండడంతో.. ప్రైవేట్‌‌వ్యాపారులు అంతకంటే ఎక్కువ చెల్లించి పత్తిని కొనుగోలు చేస్తున్నారు.