పసుపు క్వింటాల్ ధర రూ.9,501.. ఏనుమాముల మార్కెట్‌‌లో రికార్డు ధర

కాశీబుగ్గ, వెలుగు: వరంగల్‌‌లోని ఏనుమాముల వ్యవసాయ మార్కెట్‌‌లో పసుపు పంట రికార్డు ధర పలికింది. బుధవారం మార్కెట్‌‌లో పసుపు కాడి రకం ధర క్వింటాల్‌‌కు గరిష్టంగా రూ.9,501, పసుపు గోల ధర క్వింటాల్‌‌కు రూ.9,101కు అమ్ముడుపోయింది. దీంతో పసుపు రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మార్కెట్ సెక్రటరీ బీవీ రాహుల్ మాట్లాడుతూ, ఖమ్మంకు చెందిన రాంబాబు అనే పసుపు రైతు ఏనుమాముల వ్యవసాయ మార్కెట్‌‌కు 50 బస్తాల కాడి రకం పసుపు తెస్తే, రికార్డు స్థాయిలో క్వింటాల్‌‌కు రూ.9,501 ధర పలికిందన్నారు.