బ్లూటూత్​లకు హ్యాకింగ్​ ముప్పు

బ్లూటూత్​లకు  హ్యాకింగ్​ ముప్పు

స్టైల్​గా ఉంటుందని, డ్రైవింగ్​ చేసేటప్పుడు ఫోన్​ తీసే బెంగ ఉండదని చాలా మంది ఇప్పుడు చెవులకు బ్లూటూత్​లు తగిలిస్తున్నరు. కానీ, హ్యాకర్లు వాటినీ వదలట్లేదు. అందులోకి చొరబడిపోయి ఫోన్లలోని డేటా కొట్టేస్తున్నరు. బ్రిటన్​కు చెందిన సైబర్​ సెక్యూరిటీ నిపుణులు హెచ్చరిస్తున్న ముప్పు ఇది. ‘‘ఇప్పుడు చాలా మంది స్మార్ట్​ఫోన్లు వాడుతున్నారు. వాటికి బ్లూటూత్​లను కనెక్ట్​ చేస్తున్నారు. కానీ, ఆ బ్లూటూత్​లనూ హ్యాకర్లు వదిలిపెట్టట్లేదు. వాటిని హ్యాక్​ చేసేస్తున్నారు. హ్యాక్​ అవుతున్నట్టు వాటిని వాడే యూజర్లకూ తెలియకుండా పనికానిచ్చేస్తున్నారు” అని కుర్త్​ అనే సైబర్​ సెక్యూరిటీ నిపుణుడు చెప్పారు. అయితే, బ్లూటూత్​ హ్యాక్​ కాకుండా చేసేందుకు యూజర్ల వద్దే మంచి అస్త్రం ఉందన్నారు. ఉదాహరణకు ఐఫోన్​, ఐప్యాడ్​లలో సెట్టింగ్స్​లోకి వెళ్లి బ్లూటూత్​పై క్లిక్​ చేస్తే అక్కడ కనెక్ట్​ అయి ఉన్న తెలియని డివైస్​ల వివరాలు కనిపిస్తాయని, ఆ డివైస్​లు కనెక్ట్​ కాకుండా వాటిని డిసేబుల్​ చేసుకోవచ్చని సూచించారు. లేదా టర్న్​ ఆఫ్​ అయినా చేయాలన్నారు.