డంపర్‌‌ పల్టీ కొట్టి సింగరేణి కార్మికుడు మృతి

డంపర్‌‌ పల్టీ కొట్టి సింగరేణి కార్మికుడు మృతి

మణుగూరు, వెలుగు : డంపర్‌‌ పల్టీ కొట్టడంతో సింగరేణి కార్మికుడు చనిపోయాడు. ఈ ప్రమాదం భద్రాద్రికొత్తగూడెం జిల్లా సింగరేణి కాలరీస్‌‌ మణుగూరు ఏరియాలో గురువారం జరిగింది. వివరాల్లోకి వెళ్తే... కొత్తగూడెంనకు చెందిన మూల్‌‌చంద్‌‌ (61) రెండు నెలల కింద డిప్యూటేష్‌‌నపై మణుగూరు ఓసీ 2కు వచ్చి డంపర్‌‌ ఆపరేటర్‌‌గా పనిచేస్తున్నాడు. గురువారం ఓబీని యార్డ్‌‌లో డంప్‌‌ చేస్తుండగా ప్రమాదవశాత్తు డంపర్‌‌ బోల్తా పడడంతో మూల్‌‌చంద్‌‌ తీవ్రంగా గాయపడ్డాడు. గమనించిన తోటి కార్మికులు వెంటనే సింగరేణి ఏరియా హాస్పిటల్‌‌కు తరలించారు. పరీక్షించిన డాక్టర్లు మూల్‌‌చంద్‌‌ అప్పటికే చనిపోయినట్లు నిర్ధారించారు. ప్రమాదాన్ని తెలుసుకున్న కార్మిక సంఘాల లీడర్లు హాస్పిటల్‌‌కు చేరుకొని సంతాపం తెలిపారు.