కరోనా సమయంలో చాలా కంపెనీలు వర్క్ ఫ్రం హోం ను ప్రోత్సహించాయి. కరోనా తర్వాత కూడా ఇదే కొనసాగిస్తున్నాయి. అయితే వర్క్ ఫ్రం హోం ట్రెండ్ ఎంప్లా యీస్ హాజరు తగ్గడం..కంపెనీ వర్క్ ప్లేస్ వాతావారణాన్ని దెబ్బతీస్తుందని రిటర్న్ టు ఆఫీస్ ప్లాన్లను అమలు చేస్తున్న విషయం తెలిసిందే. అందులో భాగంగా ఎంప్లాయీస్ కి కొన్ని రకాల సౌకర్యాలు కల్పించి వారిని ఆఫీసులకు రప్పిస్తున్నాయి. ఈ క్రమంలో హుష్డ్ హైబ్రిడ్ అనే కొత్త ట్రెండ్.. ఆఫీసు బాసుల్ని కలవర పెడు తోందట. ఇంతకీ హుష్డ్ హైబ్రిడ్ అంటే ఏందీ.. హుష్డ్ హైబ్రిడ్ ట్రెండ్ తో సంస్థలు ఎదుర్కొంటున్న సవాళ్లేంటో చూద్దాం.
హుష్డ్ హైబ్రిడ్ కొత్త ట్రెండ్..ఉద్యోగులకు వారి ఇష్టానికి అనుగుణంగా సౌకర్యవంతమైన ఏర్పాట్లు చేయడం అన్నమాట. ఇప్పుడు ఐటీ కంపెనీల్లో ట్రెండింగ్ లో ఉంది. గతంలో ఉన్న కాఫీ బ్యాడ్జింగ్ ట్రెండ్ కి ప్రత్యామ్నాయంలా ఉంది. కంపెనీ యాజమాన్యానికి తెలియకుండా రిటర్న్ టు ఆఫీసు విధానానికి బైపాస్ గా మేనేజర్లు తమ టీం సభ్యులకు కల్పిస్తున్న అనఫిషీయల్ అరేంజ్ మెంట్స్. ప్రాడక్టివిటీ పెరగడం, ఎంప్లాయీస్ సంతృప్తిగా ఉండటం వల్ల టీం మేనేజర్లు ఈ హుష్డ్ హైబ్రిడ్ ట్రెండ్ ను ప్రోత్సహిస్తున్నారట.
అయితే ఈ కొత్త ట్రెండ్ పై ఐటీ కంపెనీలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయట. టీం మేనేజర్లు అనుసరిస్తున్న ఈ ట్రెండ్ తో ఎంప్లాయీస్ హాజరు శాతం తగ్గుతుం దట. ఎంప్లీయీస్ ని ఆఫీసులకు రప్పించడం కష్టంగా మారుతుందని అంటున్నాయి. హుష్డ్ హైబ్రిడ్ ట్రెండ్ వల్ల వచ్చే సమస్యలకు చెక్ పెట్టి ఆన్ సైట్ స్థితిని మెరుగుపర్చుకునేందుకు ప్రణాళికలు సిద్దం చేసుకుంటున్నాయట.
హుష్డ్ హైబ్రిడ్ ట్రెండ్ కు ఉదాహరణలు
- టీమ్ మేనేజర్లు రిమోట్ వర్క్ షెడ్యూల్ సెట్ చేసుకునేందుకు టీం సభ్యులకు అనుమతిస్తారు.
- టీం సభ్యుల అవసరాలను అనుగుణంగా ఏర్పాట్లు.
- అనధికారికంగా అటెండెన్స్ సర్దుబాటు.
- టీం సభ్యులకు అనుగుణంగా రిమోట్ వర్క్ ఇవ్వడం