
నల్లగొండ జిల్లాలో జాతీయ రహదారిపై పశువుల లోడ్‌తో వెళుతున్న వాహనం బోల్తా పడింది. నార్కెట్‌పల్లి వివేరా హోటల్ వద్ద బస్సును ఢీకొన్న డీసీఎం బోల్తా పడింది. డీసీఎం పశువుల లోడ్‌తో ఉండటం వలన .... ఈ ఘటనలో 14 ఆవులు మృతి చెందాయి. అయితే వాహనంలో 50 వరకు ఆవులు ఉన్నాయని సమాచారం అందుతోంది. ప్రమాదం జరిగిన వెంటనే డీసీఎం డ్రైవర్ పరారయ్యాడు. సమాచారం అవదుకున్న నార్కెట్‌పల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.