ఐపీఎల్ 2023 ట్రోఫీ చెన్నై గెలిచినా..ఆ జట్టు బౌలర్ మాత్రం చెత్త రికార్డును మూటగట్టుకున్నాడు. ఓ సీజన్ లో అత్యధిక పరుగులు సమర్పించుకున్న బౌలర్ గా తుషార్ పాండే వరస్ట్ రికార్డును తన పేరు మీద లిఖించుకున్నాడు. ఫైనల్లో 4 ఓవర్లు వేసి 56 పరుగులు సమర్పించుకున్నాడు..కానీ ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు.
ఇక ఐపీఎల్ ఫైనల్లో వికెట్ దక్కించుకోకుండా అత్యధిక పరుగులు ఇచ్చిన బౌలర్ల జాబితాలో తుషార్ దేశ్ పాండే రెండో స్థానంలో నిలిచాడు. ఈ జాబితాలో షేన్ వాట్సన్ 61 పరుగలతో అగ్రస్థానంలో ఉన్నాడు. 56 పరుగులతో ఫెర్గూసన్ తో కలిసి తుషార్ దేశ్‌పాండే(56) రెండో స్థానంలో నిలిచాడు.
ఐపీఎల్‌లో అత్యధిక పరుగులిచ్చుకున్న తొలి బౌలర్‌గా తుషార్ దేశ్‌పాండే చెత్త రికార్డును సాధించాడు. ఈ సీజన్ లో అతను 9.92 ఎకానమీతో 564 పరుగులు ఇచ్చుకున్నాడు. తుషార్ తర్వాత ప్రసిధ్ కృష్ణ 8.28 ఎకానమీతో 551 పరుగులతో రెండో స్థానంలో ఉన్నాడు. రబడా 8.34 ఎకానమీతో 548 పరుగులతో మూడో స్థానంలో.. సిద్దార్థ్ కౌల్ 8.28 ఎకానమీతో 547 పరుగులతో నాలుగో స్థానంలో కొనసాగుతున్నారు.