ఖైరతాబాద్ గణేశ్ కోసం విజయవాడ నుంచి టస్కర్.. ఎంత బరువు మోయగలదో తెలుసా..?

ఖైరతాబాద్ గణేశ్ కోసం విజయవాడ నుంచి టస్కర్.. ఎంత బరువు మోయగలదో తెలుసా..?

హైదరాబాద్: ఖైరతాబాద్ బడా గణేశ్ నిమజ్జనం కోసం ఎప్పటిలాగే విజయవాడ ఎస్టీసీ ట్రాన్స్​పోర్టుకు చెందిన భారీ టస్కర్ను తీసుకొచ్చారు.26 టైర్లు, 75 అడుగుల పొడవు, 11 అడుగుల వెడల్పుతో ఉన్న ఈ టస్కర్​100 టన్నుల బరువును మోయగలదు. 

ఈ డీఎస్-6 ట్రాయిలర్ వెహికల్​వరుసగా రెండోసారి బడా గణపతిని నిమజ్జనానికి తరలించనున్నది. అలాగే నాగర్​కర్నూలుకు చెందిన భాస్కర్​రెడ్డి 11వ సారి మహాగణపతి వాహన డ్రైవర్గా వ్యవహరించనున్నారు. ఈసారి ఖైరతాబాద్ లో ఏర్పాటు చేసిన గణేశ్​బరువు 70 టన్నులు. వెడల్పు 28 అడుగులు. అందుకు అనుగుణంగా ఆదివారం టస్కర్పై వెల్డింగ్ పనులు షురూ చేశారు.

 

విగ్రహం కదలకుండా ఉండేలా ఐరన్​ స్తంభాలతో బేస్ ఏర్పాటు చేస్తున్నారు. సోమవారం మధ్యాహ్నానికి వెల్డింగ్​పనులు పూర్తవుతాయి. సోమవారం అర్ధరాత్రి టైంలో బడా గణపతిని టస్కర్​పైకి ఎక్కిస్తారు. ఆ వెంటనే సపోర్టింగ్ వెల్డింగ్ చేస్తారు. 

ఈ ప్రక్రియ పూర్తవడానికి మూడు నుంచి నాలుగు గంటల సమయం పడుతుంది. అనంతరం వివిధ రకాల పూలతో టస్కర్ను అలంకరిస్తారు. మంగళవారం ఉదయాన్నే నిమజ్జన ఊరేగింపు మొదలవుతుంది. బడా గణేశ్​పక్కన ప్రతిష్ఠించిన శివపార్వతులు, శ్రీనివాస కళ్యాణం, బాలరాముడు, రాహువు కేతువు విగ్రహాల కోసం హైదరాబాద్​కు చెందిన మరో ట్రక్ను రెడీ చేశారు.