తొర్రూరులో డబుల్ ఇండ్ల వద్ద లొల్లి

తొర్రూరులో డబుల్ ఇండ్ల వద్ద లొల్లి
  • అక్రమంగా ఉండే వారిని 
  • ఖాళీ చేయిస్తున్న అధికారులు 
  • పెట్రోల్​ తాగి ఆత్మహత్యాయత్నం చేసిన మహిళ 

పాలకుర్తి, వెలుగు : డబుల్​ బెడ్​ రూమ్ ఇండ్లలో అక్రమంగా ఉండే వారికి, ఖాళీ చేయించేందుకు వెళ్లిన అధికారులకు మధ్య జరిగిన లొల్లి తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. దీంతో ఓ మహిళ పెట్రోల్​ తాగి ఆత్మహత్యాయత్నం చేసిన ఘటన బుధవారం జనగామ జిల్లాలో జరిగింది.  వివరాల్లోకి వెళితే.. పాలకుర్తి మండలం తొర్రూరులో గత సర్కార్ 20 డబుల్​ బెడ్ రూమ్ ఇండ్లను నిర్మించినా లబ్ధిదారులు ఇవ్వలేదు.

ప్రభుత్వం మారడంతో గ్రామానికి చెందిన కొందరు వాటిలో అక్రమంగా ఉంటున్నారు. అధికారులు ఖాళీ చేయాలని కోరినా పట్టించుకోవడంలేదు.  బుధవారం తహసీల్దార్​ శ్రీనివాస్, రెవెన్యూ సిబ్బంది పోలీసులతో కలిసి వెళ్లి ఖాళీ చేయిస్తుండగా ఆఫీసర్లతో వాగ్వాదం జరిగింది. దీంతో గడ్డం భూలక్ష్మి అనే మహిళ పెట్రోల్​తాగి ఆత్మహత్యాయత్నం చేయడంతో జనగామ ఏరియా హాస్పిటల్​కి తీసుకెళ్లారు.  డబుల్ ఇండ్లకు ఇంకా లబ్ధిదారులను ఎంపిక చేయలేదని, కొంతమంది కావాలనే ఆక్రమించుకుని ఉంటున్నారని ఆర్​డీవో డీఎస్​వెంకన్న తెలిపారు.