క్వార్టర్ ఫైనల్లో టూటోరూట్‌‌‌‌, ఫాల్కన్స్‌‌‌‌

క్వార్టర్ ఫైనల్లో టూటోరూట్‌‌‌‌, ఫాల్కన్స్‌‌‌‌

హైదరాబాద్, వెలుగు: టీ9 చాలెంజ్ గోల్ఫ్‌‌‌‌ మూడో సీజన్‌‌‌‌లో టూటోరూట్‌‌‌‌, ఫెయిర్‌‌‌‌‌‌‌‌వే ఫాల్కన్స్ జట్టు క్వార్టర్ ఫైనల్‌‌‌‌కు దూసుకెళ్లాయి. మూడో రౌండ్లలో సత్తా చాటిన టూటోరూట్‌‌‌‌ పూల్‌‌‌‌–ఎలో 9 పాయింట్లతో టాప్‌‌‌‌ ప్లేస్ సొంతం చేసుకుంది. అదే గ్రూప్‌‌‌‌ నుంచి  బంకర్ బస్టర్స్ (7.5 పాయింట్లు) రెండో స్థానంతో నాకౌట్ చేరుకుంది.  

పూల్–బి నుంచి ఫెయిర్‌‌‌‌వే ఫాల్కన్స్ (8.5), కైన్ డెయిరీ  (7.5) టీమ్స్‌‌‌‌, పూల్–సి నుంచి లవిస్టా క్రూసేడర్స్ (7.5), సెమెట్రిక్స్ (6) కూడా ముందంజ వేశాయి. పూల్–డిలో శ్రీనిధి డెక్కన్ వారియర్స్ (7.5), సమ్మర్ స్టార్మ్ (6.5) తొలి రెండు స్థానాలతో నాకౌట్‌‌‌‌కు క్వాలిఫై అయ్యాయి. 

మంగళవారం నుంచి క్వార్టర్ ఫైనల్స్‌‌‌‌ జరుగుతాయి. రౌండ్‌‌‌‌ రాబిన్ దశ ముగియగా..  టీ– గోల్ఫ్ ఫౌండేషన్ ప్రెసిడెంట్ డాక్టర్ ఎన్‌‌‌‌ఆర్‌‌‌‌ఎన్ రెడ్డి, ఎమ్మార్ సంస్థ సీఎఫ్‌‌‌‌ఓ మధుసూధన్ రావుతో కలిసి మూడో సీజన్‌ ట్రోఫీని ఆవిష్కరించారు.