జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలి : టీయూడబ్ల్యూజే

యాదాద్రి(భువనగిరి), వెలుగు : దీర్ఘకాలికంగా పెండింగ్​లో ఉన్న జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించాలని టీయూడబ్ల్యూజే (ఐజేయూ) జిల్లా అధ్యక్షుడు యంబ నర్సింహులు, ఎలక్ట్రానిక్ మీడియా జిల్లా అధ్యక్షుడు భువనగిరి మల్లేశం ప్రభుత్వాన్ని కోరారు. సోమవారం భువనగిరిలో జరిగిన టీయూడబ్ల్యూజే జిల్లా కమిటీ సమావేశంలో వారు మాట్లాడారు. 

జర్నలిస్టుల సంక్షేమానికి పెద్దపీట వేస్తామన్న ప్రభుత్వం.. ఇచ్చినమాటను నిలబెట్టుకోవాలన్నారు. గతంలో పట్టాలు ఇచ్చిన జర్నలిస్టులందరికీ వెంటనే ఇండ్ల స్థలాలు కేటాయించాలని, జర్నలిస్టుల పిల్లలకు స్కూల్ ఫీజుల్లో రాయితీ ఇవ్వాలన్నారు. జర్నలిస్టుల హెల్త్ కార్డులు అన్ని ఆస్పత్రుల్లో చెల్లుబాటు అయ్యేలా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయాలని కోరారు. ఈనెల 19, 20 తేదీల్లో ఖమ్మంలో నిర్వహిస్తున్న సంఘం రాష్ట్ర మహాసభలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. 

సమావేశంలో యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి పోతంశెట్టి కరుణాకర్, రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు వెలిమినేటి జహంగీర్, పాశం నవీన్, ఆరే కుమార్, బాలకృష్ణ, శశిధర్ రెడ్డి, సైమన్, బైరి విశ్వనాథం, ఎం.మల్లేశం, ఎండీ జమాలుద్దీన్, సతీశ్, సురేశ్, జి.నాగరాజు, పి.నరసింహాచారి, ఎండీ అఫ్జల్ తదితరులు పాల్గొన్నారు.