మీ పిల్లలు స్మార్ట్​ ఫోన్లకు బాగా అలవాటయ్యారా..? 299 రూపాయలు మీవి కాదనుకుంటే..

మీ పిల్లలు స్మార్ట్​ ఫోన్లకు బాగా అలవాటయ్యారా..? 299 రూపాయలు మీవి కాదనుకుంటే..

ఈ కాలం పిల్లలు స్మార్ట్​ ఫోన్లకు బాగా అలవాటయ్యారు. అందుకే ఆటలాడడానికే కాదు స్మార్ట్​ఫోన్​ను క్రియేటివిటీ పెరిగేలా వాడడం కూడా పిల్లలకు నేర్పించాలి. అందుకోసం ఇలాంటి స్టైలస్​లతో బొమ్మలు​ వేయించడం, పజిల్స్​ పూర్తి చేయడం లాంటివి చేయాలి. దీన్ని టక్జర్​ అనే కంపెనీ మార్కెట్​లోకి తీసుకొచ్చింది. ఈ పెన్​తో ఫోన్​లో డ్రాయింగ్, డిజైనింగ్, నోట్ టేకింగ్, స్కెచింగ్, రైటింగ్​ లాంటివన్నీ చేయొచ్చు.

 ఇది స్టెయిన్‌‌‌‌‌‌‌‌లెస్ స్టీల్, అల్యూమినియం బాడీతో వస్తుంది. మామూలు పెన్నులా జేబుకు పెట్టుకుని తీసుకెళ్లొచ్చు. దీనికి బ్యాటరీ అవసరం లేదు. ఛార్జింగ్ పెట్టాల్సిన పని కూడా లేదు. ప్యాక్​లో సిలికాన్ డిస్క్ టిప్​, మైక్రో-నిట్ హైబ్రిడ్ ఫైబర్ టిప్ వస్తాయి. రెండు వైపులా రెండింటిని పెట్టుకోవచ్చు. ఫైబర్ టిప్​ని ముఖ్యంగా ట్యాప్, స్క్రోలింగ్ చేయడానికి వాడుకోవచ్చు. ఇది ఐప్యాడ్, ఐఫోన్, టాబ్లెట్‌‌‌‌‌‌‌‌లు, స్మార్ట్‌‌‌‌‌‌‌‌ఫోన్, ఇ–రీడర్‌‌‌‌‌‌‌‌లు, మైక్రోసాఫ్ట్ సర్ఫేస్.. ఇలా అన్నింటిలోనూ పనిచేస్తుంది. 

ధర : రూ. 299