గుండెపోటుతో ఖని జర్నలిస్టు చిరంజీవి మృతి

గోదావరిఖని, వెలుగు: గోదావరిఖనిలో టీవీ రి పోర్టర్, ప్రెస్ క్లబ్ సభ్యుడు సిరిశెట్టి చిరంజీవి (49) ఆదివారం గుండెపోటుతో మరణించారు. గోదావరిఖని గాంధీనగర్ లోని తన నివాసంలో ఉండగా గుండెపోటు కు గురయ్యారు. వెంటనే కుటుంబ సభ్యులు స్పందించి 108 వెహికల్ ద్వారా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, అప్పటికే చిరంజీవి మృతి చెందినట్లు డాక్టర్లు నిర్ధారించారు. 

చిరంజీవి మృతదేహాన్ని గాంధీ నగర్ లోని ఆయన నివాసానికి తీసుకువచ్చారు. చిరంజీవికి భార్య, కూతురు, కుమారుడు ఉన్నారు. కాగా గోదావరిఖని ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు పూదరి కుమార్, ప్రధాన కార్యదర్శి పందిళ్ళ శ్యాంసుందర్, ఇతర క్లబ్ సభ్యులు చిరంజీవి మృతదేహంపై పూలమాల వేసి ఘనంగా ని వాళులర్పించారు. జర్నలిస్ట్ చిరంజీవి మృతి పట్ల రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ సంతాపం తెలిపారు.