ఫుల్ గా మందు కొట్టి కారు యాక్సిడెంట్ చేసిన డైరెక్టర్.. ఒకరు మృతి..

ఫుల్ గా మందు కొట్టి కారు యాక్సిడెంట్ చేసిన డైరెక్టర్.. ఒకరు మృతి..

మద్యం సేవించడం ఆరోగ్యానికి హానికరం, మద్యం సేవించి వాహనాలు నడపరాదని ప్రభుత్వం, పోలీసులు హెచ్చరిస్తున్నపటికీ కొందరు వీటిని ఏమాత్రం ఖాతరు చెయ్యడం లేదు. ఫలితంగా రోడ్డు ప్రమాదాల్లో అమాయకుల ప్రాణాలు గాల్లో కలసిపోతున్నాయి. అయితే హిందీ టీవీ సీరియల్ డైరెక్టర్ సిద్ధాంత్ దాస్ పట్ఠపగలే మద్యం సేవించి కారు నడుపుతూ యాక్సిడెంట్ చేసిన ఘటన  కోల్‌కతాలో చోటు చేసుకుంది. ఈ ఘటనలో పలువురికి గాయాలు కాగా ఒక వ్యక్తి మృతి చెందాడు.

పూర్తి వివరాల్లోకి వెళితే డైరెక్టర్ సిద్ధాంత్ దాస్ ఆదివారం ఉదయం తన కుటుంబ సభ్యులతో కలసి బక్రహత్ నుండి గరియాహత్ వైపు కారులో వెళుతుండగా ఠాకూర్ పుకూర్ మార్కెట్ ప్రాంతానికి రాగానే కారు అదుపుతప్పి ప్రమాదానికి గురైంది. దీంతో మార్కెట్ లో నడుస్తున్నవారిపై, అలాగే రోడ్డు ప్రక్కన ఆపి ఉన్న స్కూటర్ వాహనాల్ని కూడా ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో అమీనూర్ రెహమాన్ (63) అనే కూరగాయల వ్యాపారి మృతి చెందాడు. తీవ్ర గాయాలపాలైన  రెహమాన్ ని సమీపంలోని ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ ఆయన మృతి చెందారు. జయదేబ్ మజుందార్ (68) అనే వ్యక్తి  కూడా తీవ్ర గాయాలతో ప్రాణాలతో పోరాడుతున్నట్లు సమాచారం. 

Also Read : షారుఖ్ కుమార్తె సుహానా ఖాన్ తల్లిగా దీపికా పదుకొనే!

అయితే ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు పోలీసులకి సమాచారం ఇవ్వగా వెంటనే పోలీసులు సిద్ధాంత్ దాస్ తోపాటూ కారులో ప్రయాణిస్తున్న మరో మహిళని కూడా అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేశారు. కానీ వీరితోపాటూ ఉన్న మరో మహిళ సంఘటన స్థలం నుంచి పారిపోయింది. అయితే ప్రమాదం జరిగిన సమయంలో సిద్ధాంత్ దాస్ మద్యం సేవించినట్లు తేలింది. మద్యం మత్తులో కారు నడిపిన కారణంగానే కారు అదుపు తప్పి యాక్సిడెంట్  జరిగిందని పోలీసులు కనుగొన్నారు. దీంతో పలు సెక్షన్ల క్రింద సిద్ధాంత్ దాస్ పై కేసు నమోదు చేసి కటకటాల్లోకి నెట్టారు.