SA20: నేటి నుంచి సౌతాఫ్రికా టీ20 లీగ్.. లైవ్ స్ట్రీమింగ్ ఎందులో చూడాలంటే..?

SA20: నేటి నుంచి సౌతాఫ్రికా టీ20 లీగ్.. లైవ్ స్ట్రీమింగ్ ఎందులో చూడాలంటే..?

క్రికెట్ అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న సౌతాఫ్రికా ప్రీమియర్ లీగ్ గురువారం (జనవరి 9) నుంచి ప్రారంభం కానుంది. టైటిల్ కోసం మొత్తం ఆరు జట్లు తలపడే ఈ లీగ్ ఫ్యాన్స్ ను అలరించడానికి సిద్ధంగా ఉంది. ఈ సీజన్ లో తొలి మ్యాచ్ లో నేడు (జనవరి 9) డిఫెండింగ్ ఛాంపియన్ సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్ ముంబై ఇండియన్స్ కేప్ టౌన్ తో తలపడుతుంది. జనవరి 9 నుండి ప్రారంభం కానున్న ఈ టోర్నీ ఫిబ్రవరి 8 న ముగుస్తుంది. ఫైనల్ కు జోహన్నెస్‌బర్గ్‌ ఆతిధ్యమిస్తుంది.

ఇప్పటివరకు ఈ లీగ్ రెండు సీజన్ లు జరిగింది. రెండు సార్లు సన్ రైజర్స్ ఈస్టర్న్ క్యాపిటల్స్ టైటిల్ విజేతగా నిలిచింది. సెయింట్ జార్జ్ పార్క్‌లో క్వాలిఫైయర్ 1.. సెంచూరియన్‌లో ఎలిమినేటర్‌,క్వాలిఫయర్ 2 మ్యాచ్ లు జరుగుతాయి. ఐపీఎల్ తర్వాత సౌతాఫ్రికా టీ20 లీగ్ కు మంచి ఆదరణ లభిస్తుంది. ఐపీఎల్ తర్వాత ఈ లీగ్ చూసేందుకే అభిమానులు ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. దీనికి తోడు అంతర్జాతీయ స్టార్ క్రికెటర్లు ఈ లీగ్ ఆడేందుకు ఆసక్తి చూపిస్తున్నారు.

లీగ్ దశలో ఒక్కో జట్టు 10 మ్యాచ్‌లు ఆడుతుంది. మొదటి నాలుగు స్థానాల్లో నిలిచిన జట్లు ప్లేఆఫ్‌కు చేరుకుంటాయి. గ్రూప్ దశలో తొలి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు క్వాలిఫైయర్ 1 లో తలపడతాయి. గెలిచిన జట్టు ఫైనల్‌కు వెళ్తుంది. మూడు, నాలుగవ స్థానంలో నిలిచిన  జట్లు ఎలిమినేటర్ మ్యాచ్ ఆడతాయి.  ఈ మ్యాచ్‌లో విజేతగా నిలిచిన జట్టు క్వాలిఫైయర్ 1 లో ఓడిన వారితో క్వాలిఫైయర్ 2 ఆడతారు. గెలిచిన జట్టు ఫైనల్ కు వెళ్తుంది. 

2025 సౌతాఫ్రికా టీ20లో పోటీపడే ఆరు జట్లు: 

1) సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్

2) MI కేప్ టౌన్

3) డర్బన్ యొక్క సూపర్ జెయింట్స్

4) ప్రిటోరియా క్యాపిటల్స్

5) జోబర్గ్ సూపర్ కింగ్స్

6) పార్ల్ రాయల్స్

లైవ్ స్ట్రీమింగ్ ఎందులో చూడాలంటే..?

సౌతాఫ్రికా టీ20 లీగ్ టీవీ టెలికాస్ట్ ఇండియాలో స్టార్ స్పోర్ట్స్ 2,  స్పోర్ట్స్ 18 2 ప్రత్యక్ష ప్రసారం చేయబడుతుంది. ఆన్‌లైన్ ప్రత్యక్ష ప్రసారం డిస్నీ ప్లస్ హాట్ స్టార్, వెబ్‌సైట్‌లో లైవ్ చూడొచ్చు. సాయంత్రం జరిగే మ్యాచ్ లు 4:30 లకు.. రాత్రి జరిగే మ్యాచ్ లు 9:00 గంటలకు ప్రారంభమవుతాయి.