లాంచింగ్ విషయంలో గత రెండు నెలలుగా బిజీబిజీగా ఉన్న టీవీఎస్ నవంబర్ లో స్పోర్టీ బైక్ ను విడుదల చేసింది. తాజాగా TVS అపాచీ RTR310ని విడుదల చేసింది. RTR310 అనేది RR310 కు నేకెడ్ వెర్షన్. ఇటీవల మార్కెట్లోకి విడుదలైన ఈ బైక్ ధర, ప్రత్యేకతలు, ఫీచర్ల గురించి తెలుపుకుందాం.
డిజైన్ విషయంలోకి వస్తే RTR310 అపాచ్ ముందు వైపు నుంచి దూకుడుగా స్పోర్టీగా కనిపిస్తుంది. స్పిల్డ్ LED హెడ్ ల్యాంప్ లు , షార్ఫ్ గా ఉండే ఫ్యుయెల్ ట్యాంక్ డిజైన్, ట్విన్ పీస్ సీట్, రైజ్డ్ టెయిట్ సెక్షన్ ఆకట్టుకుంటున్నాయి. రైడర్ స్థానం నిటారుగా, ఆకర్షణీయంగా ఉంటుంది. ఎగ్జాస్ట్ నేరుగా RR310 బైక్ నుంచి తీసుకోబడింది.
TVS Apache RTR310 ప్రత్యేకతలు
TVS Apache RTR310 బైక్ 312 సీసీ లిక్విడ్ కూల్డ్ సింగిల్ సిలిండర్ టెక్నాలజీ ఇంజిన్ తో వస్తోంది. ఇది 35.6 bhp, 28.7 Nmటార్క్ తో ఉత్పత్తి చేయగలదు. ఈ బైక్ లో ట్రాన్స్ మిషన్ అనేది 6 స్పీడ్ గేర్ బాక్స్, అసిస్ట్, స్లిప్పర్ క్లచ్ తో ఉంది.
TVS టన్నుల కొద్దీ ఫీచర్లతో RTR310 ని లోడ్ చేసింది. ల్యాండ్ స్కేప్ ఓరియెంట్ 5.0 అంగుళాల TFT స్క్రీన్ తో వస్తుంది. ఈ స్క్రీన్ పై మనకు స్పీడో మీటర్, ఓడో మీటర్, ట్రిప్ మీటర్, గేర్ ఇండికేటర్, టెంపరేచర్ కనిపిస్తాయి. ఇతర ఫీచర్లలో LED హెడ్ లైట్లు, టెయిల్ లైట్, క్రూయిజ్ కంట్రోల్, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్, హీటెడ్, కూల్డ్ సీట్లు ఉన్నాయి. RTR310 డైనమిక్ స్టెబిలిటీ కంట్రోల్, లీనియర్ స్టెబిలిటీ కంట్రోల్ వంటి రేస్ స్పెసిఫిక్ మోడల్ ను అందిస్తోంది.
TVS Apache RTR310 ధరను రూ. 2.86 లక్షలు, ఆన్ రోడ్ రూ. 3.10లక్షలు ధరను నిర్ణయించారు.