TVS Creon ఎలక్ట్రిక్ స్కూటర్.. ఇప్పుడు భారతీయ ఎలక్ట్రిక్ స్కూటర్ మార్కెట్ ను షేక్ చేస్తోంది. పెట్రోల్ కష్టాలనుంచి బయటపడాలనుకునే వారికి ఇది మంచి ఎంపిక. చూడగానే ఆకట్టుకునే లుక్ తో అద్భుతంగా ఉంది. TVS Creon శక్తివంతమైన ఎలక్ట్రిక్ మోటార్ తో పనిచేస్తుంది. అత్యధికంగా 12kW గరిష్ట శక్తిని విడుదల చేస్తుంది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ మెరుపు వేగంతో 2.6 సెకన్లలో గంటకు 0 నుంచి 40 కిలోమీటర్ల వేగాన్ని అందుకోగలదు. ఇది పెట్రోల్ స్కూటర్ల మించి పనిచేస్తుంది.
అధికారికంగా ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ రేంజ్ వెల్లడి కానప్పటికీ .. ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే 140 కిలోమీటర్లు ప్రయాణించొచ్చని అంచనాలు సూచిస్తున్నాయి. ఈ TVS Creon రెండు ఛార్జింగ్ ఎంపికలతో వస్తుంది. పోర్టబుల్ 950W ఛార్జర్, 3kW స్మార్ట్ X హోమ్ రాపిడ్ ఛార్జర్(విడిగా కొనుక్కోవచ్చు) . ప్రయాణంలో బ్యాటరీని టాప్ చేయడానికి పోర్టబుల్ ఛార్జర్ సరైనది. అయితే హోమ్ ఛార్జర్ రాత్రి పూట ఛార్జింగ్ చేయడానికి వేగవంతంమైన , సౌకర్యవంతమైన ఎంపికను అందిస్తుంది.
- TVS X (TVS Creon) తో ప్రయాణం సురక్షితం.
- రహదారిపై సురక్షితంగా ప్రయాణించేందుకు అనేక ఫీచర్లను కలిగి ఉంది.
- సక్సెస్ ఫుల స్టాపింగ్ వపర్ కోసం ముందు వెనక చక్రాలకు డిస్క్ బ్రేకులు
- హార్డ్ బ్రేకింగ్ సమయంలో ముఖ్యంగా జారి ప్రదేశాలు ఉన్నచోట వీల్ లాకప్ ను నిరోధించేందుకు యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ (ABS) ఉంటుంది.
- రియల్ టైమ్ బ్యాటరీ మానిటరింగ్, జియో ఫెన్సింగ్ , రైడ్ స్టాటిస్టిక్స్ వంటి ఫీచర్ల కోసం మీ స్మార్ట్ ఫోన్ ను స్కూటర్ కి కనెక్ట్ చేయడానికి Smart Xconnect టెక్నాలజీ ఉంటుంది.
- TVS X (TVS Creon) కేవలం పనితీరులోనే కాదు.. ఆకట్టుకునే ఫ్యూచరిస్టిక్ డిజైన్ లాంగ్వేజ్, షార్ప్ గా ఉండే బాడీ వర్క్, స్పోర్టినెస్ లుక్ తో అందుబాటులోకి వస్తుంది.
- ఇంకా రంగుల ఎంపిక గురించి సమాచారం లేదు . బహుశా ఇది నలుపు రంగులో ఉండొచ్చని అంచనా.
ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ధర రూ. 2లక్షల 49వేల 990 (ఎక్స్ షోరూమ్ ) .. ఇతర ఎలక్ట్రిక్ స్కూటర్లతో పోలిస్తే ఇది ప్రీమియం ఆఫర్.