కొత్త బైక్ : లక్ష రూపాయల్లో టీవీఎస్ రైడర్ సూపర్.. ఫీచర్స్ ఇవే

కొత్త బైక్ : లక్ష రూపాయల్లో టీవీఎస్ రైడర్ సూపర్.. ఫీచర్స్ ఇవే

TVS మోటార్ కంపెనీ తన ప్రముఖ మోటార్‌సైకిల్ రైడర్ 125 యొక్క సూపర్ స్క్వాడ్ ఎడిషన్‌ను విడుదల చేసింది. మార్వెల్ సూపర్ హీరోస్ స్ఫూర్తితో సరికొత్త రైడర్ 125 సూపర్ స్క్వాడ్ ఎడిషన్ బైక్ లను టీవీఎస్ డిజైన్ చేసింది. రైడర్ 125 తో పాటు ఎన్ టార్క్ 125 బైక్స్ ను కూడా సూపర్ స్క్వాడ్ ఎడిషన్ డిజైన్ లో రూపొందించిన టీవీఎస్..వీటిని మార్కెట్లోకి విడుదల చేసింది.

టీవీఎస్ మార్వెల్ సూపర్ స్క్వాడ్ ఎడిషన్ లో రెండు వేరియంట్లు అందుబాటులోకి వచ్చాయి. ఇందులో ఒకటి మార్వెల్ సూపర్ హీరోస్ లో ఒకరైన ఐరన్ మ్యాన్ స్ఫూర్తితో రూపొందింది. మరోకటి  బ్లాక్ పాంథర్ స్ఫూర్తితో డిజైన్ తో రూపొందింది.  ఈ సరికొత్త టీవీఎస్ రైడర్ సూపర్ స్క్వాడ్ ఎడిషన్ ఎక్స్ షో రూమ్ ధర ఢిల్లీలో రూ. 98,919 గా నిర్ణయించబడింది. ఐరన్ మ్యాన్ సూపర్ స్క్వాడ్ వేరియంట్ లో రెడ్, బ్లాక్ కలర్ స్కీమ్ ను ఉపయోగించారు. అలాగే, బ్లాక్ పాంథర్ సూపర్ స్క్వాడ్ వేరియంట్ లో బ్లాక్, పర్పుల్ కలర్ స్కీమ్ ను ఉపయోగించారు.

టీవీఎస్  సూపర్ స్క్వాడ్ స్పెషల్ ఎడిషన్ రైడర్ 125 బైకుల్లో మెకానికల్ మార్పులు చేయలేదు. ఔట్ లుక్ డిజైన్ లో మాత్రమే మార్పులు చేశారు. ఈ స్పెషల్ ఎడిషన్ బైక్స్ లో కూడా 124.8 CC ఎయిర్ కూల్డ్ ఇంజన్ ఉంటుంది. ఇది 11.22 BHPగరిష్ట పవర్ ను, 11.2 NM టార్క్ ను ప్రొడ్యూస్ చేయగలదు. ఇందులో 5 స్పీడ్ గేర్ బాక్స్ ఉంది. ఈ బైక్ లో ముందుభాగంలో టెలిస్కోపిక్ ఫోర్క్స్, వెనుక భాగంలో 5 స్టెప్ అడ్జస్టబుల్ మోనో షాక్ సస్పెన్షన్ సిస్టమ్ ను అమర్చారు. ఈ బైక్ లో 17 ఇంచ్ ల అలాయ్ వీల్స్ ను సెట్ చేశారు.