TVS మోటార్స్ కంపెనీ నెలవారి అమ్మకాల్లోరికార్డు సృష్టించింది. ఒక్క 2024 జనవరి నెలలోనే 23శాతం వృద్దితో 3,39,513 యూనిట్ల నెలవారి అమ్మకాలను నమోదు చేసింది. వీటిలో దేశీయ, ఎగుమతులకోసం బైకులు, ఎలక్ట్రిక్ వాహనాలు, త్రీ వీలర్లు ఉన్నాయి. అయితే హోసూర్ వాహన తయారీ సంస్థ గతేడాది (2023)లో మొత్తం 2,75,115 యూనిట్లను విక్రయించింది.
2024 జనవరిలో TVS బైకుల అమ్మకం
మొత్తం ద్విచక్ర వాహనాల 25శాతం వృద్ధిని నమోదు చేశాయి. జనవరి2023లో అమ్మకాలు 2,64,710 ఉండగా.. 2024 జనవరిలో 3,29,937 యూనిట్లకు పెరిగాయి. జనవరి 2023లో 2,16,417 యూనిట్ల నుంచి 2,64,233 యూనిట్లకు పెరిగిన దేశీయ ద్విచక్రవాహన విక్రయాలు 24 శాతం వృద్దిని నమోదు చేశాయి.
EV అమ్మకాలు 34 శాతం వృద్ధిని నమోదు చేశాయి. జనవరి 2023లో అమ్మకాలు 12,169 యూనిట్లు ఉండగా.. జనవరి 2024లో 16,276 యూనిట్లకు పెరిగాయి.TVS ప్రస్తుతం బ్యాటరీతో నడిచే రెండు స్కూటర్లను రిటైల్చేస్తోంది . అవి TVS iQube, TVS X