టీడబ్ల్యూజేఎఫ్​ సభ్యత్వ నమోదు షురూ

హైదరాబాద్ సిటీ, వెలుగు : హైదరాబాద్ యూనియన్ ఆఫ్ జర్నలిస్ట్స్ (రి.నెం బి2794 టీడబ్ల్యూజేఎఫ్ అనుబంధం) సభ్యత్వ నమోదు కార్యక్రమం మంగళవారం సచివాలయంలో ప్రారంభమైంది. టీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు మామిడి సోమయ్య ముఖ్యఅతిథిగా పాల్గొనగా హెచ్ యూజే అధ్యక్షుడు బి.అరుణ్ కుమార్ అధ్యక్షత వహించారు. జర్నలిస్టులు తరలివచ్చి సభ్యత్వం తీసుకున్నారు. 

ఈనెల 30 వరకు సభ్యత్వ నమోదు కార్యక్రమం కొనసాగుతుందని చెప్పారు. కార్యదర్శి బి.జగదీశ్, టీడబ్ల్యూజేఎఫ్ ఉపాధ్యక్షుడు పిల్లి రాంచందర్, టీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర కార్యదర్శి చంద్రశేఖర్, రాజశేఖర్, నవీన్, పద్మరాజు, నాగవాణి, ప్రశాంత్, విజయ తదితరులు పాల్గొన్నారు.