Actress Wedding: ప్రేమించి పెళ్లి చేసుకున్న ఇద్దరు హీరోయిన్లు.. ఫోటోలు వైరల్

Actress Wedding: ప్రేమించి పెళ్లి చేసుకున్న ఇద్దరు హీరోయిన్లు.. ఫోటోలు వైరల్

ప్రపంచంలో ఎన్నో వింతలు తరుచూ చూస్తూ వస్తున్నాం. వింటూ వస్తున్నాం. అందులో చాలా వరకు పాత వింతలే ఉంటాయి. కానీ, అవే మనల్ని ఆశ్చర్యపోయేలా చేస్తాయి. ఇపుడీ అలాంటి ఆశ్చర్యమే ఓ ఇద్దరు హీరోయిన్లు నెటిజన్లకు కలిగించారు. వీరిద్దరూ కలిసి ఒక అబ్బాయిని ప్రేమించారో.. పెళ్లి చేసుకున్నారో.. అనుకునేరు? వీరిద్దరే మనసులు ఇచ్చుపుచ్చుకుని, ఉంగరాలు మార్చుకుని పెళ్లి చేసుకున్నారు. ఇదే ఈ హీరోయిన్ల ప్రేమ వింత. ఆ ప్రేమ వివరాల్లోకి వెళితే..   

హాలీవుడ్ నటి క్రిస్టెన్ స్టీవర్ట్ తన ప్రేయసి డిలన్ మేయర్‌ను వివాహం చేసుకున్నారు. ఆదివారం 2025 ఏప్రిల్ 20న లాస్ ఏంజిల్స్‌లోని వారి ఇంట్లో జరిగిన సన్నిహిత వేడుకలో ఈ జంట ప్రతిజ్ఞలు చేసుకున్నారు. ముందుగా వీరిద్దరూ కోర్టులో వివాహ లైసెన్స్ పొందాక.. ఆ తర్వాత పెళ్లి చేసుకున్నారు. ప్రస్తుతం వీరిద్దరూ పెళ్లి చేసుకున్న ఫోటోలు వైరల్ అవుతున్నాయి.

ఆ ఫోటోలలో వారిద్దరూ ఒకరి వేళ్లకు ఒకరు ఉంగరాలు మార్చుకుంటూ ప్రేమతో ముద్దుపెట్టుకుంటున్నారు. అయితే, 2013లో ఓ సినిమా షూటింగ్ లో వీరికి పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత రెండేళ్లు డేటింగ్ లో ఉన్నారు. చివరగా 2021లో ఎంగేజ్ మెంట్ చేసుకున్నట్లు ఇంస్టాగ్రామ్ వేదికగా ప్రకటించారు.

Also Read :  తప్పిపోయిన బిడ్డను రక్షించిన దిశా పటాని సోదరి

అలా కొన్ని సంవత్సరాలుగా, వారు తమ సంబంధం గురించి బహిరంగంగానే మాట్లాడుతూ నెటిజన్ల దృష్టిలో ఉన్నారు. ఇకపోతే, నటి క్రిస్టెన్ ట్విలైట్ ఫ్రాంచైజీ మూవీస్ తో బాగా పాపులర్ అయింది. డిలన్ మేయర్ రైటర్ గా, నటిగా రాణిస్తోంది. ఆస్కార్ నామినేట్ చేయబడిన స్క్రీన్ రైటర్ నికోలస్ మేయర్ కుమార్తెనే ఈ డిలన్ మేయర్.