పుట్టుకలోనూ..చావులోనూ కలిసే..రోడ్డు ప్రమాదంలో కవలలు మృతి

పుట్టుకలోనూ..చావులోనూ కలిసే..రోడ్డు ప్రమాదంలో కవలలు మృతి
  •     మరో వ్యక్తికి తీవ్ర గాయాలు..
  •     ఖమ్మం జిల్లా రూరల్​ మండలం దానవాయిగూడెంలో విషాదం 

ఖమ్మం రూరల్, వెలుగు : ఖమ్మం జిల్లాలో జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో కవల సోదరులు కన్నుమూశారు.రూరల్ ​మండలం దానవాయిగూడెం గ్రామానికి చెందిన అత్తులూరి నర్సింహారావు, రమ దంపతులకు మహేశ్(24), నవీన్ (24) అనే ఇద్దరు ట్విన్స్​ఉన్నారు. మహేశ్ ​కూసుమంచిలో మెకానిక్ ​కాగా, నవీన్ ​డిగ్రీ పూర్తి చేసి ఖాళీగా ఉంటున్నాడు. మంగళవారం పని ఉండడంతో కూసుమంచి మండలం పెరికసింగారం గ్రామానికి అన్నదమ్ములతో పాటు మరో వ్యక్తి టూవీలర్​పై వెళ్తున్నారు. వీరి బండిపై ఇంజిన్​ఆయిల్​ డబ్బాల బాక్స్​ కూడా ఉంది.

మద్దులపల్లికి ముందు ఓ మూలమలుపుపై సూర్యాపేట వైపు నుంచి వస్తున్న టాటా ఏస్ ​వ్యాన్ ​వీరి బైక్​ను ఢీకొట్టింది. కంట్రోల్​ చేసుకోవాలని చూసినా బైక్​పై డబ్బాలు ఉండడంతో వీలు కాలేదు. దీంతో మహేశ్, నవీన్​అక్కడిక్కడే చనిపోగా, మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. కాగా, మృతుల తండ్రి నర్సింహారావు హైదరాబాద్​లో ఉన్నట్లు తెలిసింది. రూరల్​ఎస్ఐ రామారావు, సీఐ రాజు ఘటనా స్థలాన్ని పరిశీలించారు., కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.