నిండుకుండలా ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ జలాశయాలు

నిండుకుండలా ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ జలాశయాలు

హైదరాబాద్ సిటీకి తాగునీరందించే జంట శలాశయాలు ఉస్మాన్ సాగర్,హిమాయత్ సాగర్ లకు ఎగువనుంచి వరద వచ్చి చేరుతోంది. దీంతో జలశయాలు డు కుండలా ఉన్నాయి.  ఉస్మాన్ సాగర్ ప్రాజెక్టుకు 350 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతోంది.

 ఉస్మాన్ సాగర్ ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 1790 అడుగులు కాగా.. ప్రస్తుతం 1789.85 అడుగులకు చేరింది. నీటి నిల్వ సామర్థ్యం  3900 టీఎసీలు కాగా.. ప్రస్తుతం 3.888 టీఎంసీల నీటి నిల్వ ఉంది.  రెండు గేట్లు 1అడుగు మేర ఎత్తి 234క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు.  

Also Read :- తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం

మరోవైపు హిమాయత్ సాగర్ కు 1400 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతోంది. హిమాయత్ సాగర్ పూర్తి స్థాయి నీటి మట్టం 1763.50 అడుగులు కాగా.. ప్రస్తుతం 1962.90 అడుగులుగా ఉంది. నీటి నిల్వ సామర్థ్యం 2.970 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 2.772 టీఎంసీల నీటి నిల్వ ఉంది.