
- ప్రభుత్వ స్కూళ్లలో విద్యార్థుల సంఖ్యను పెంచడమే ప్రోగ్రాం ఉద్దేశం
- అధికారులకు శిక్షణ కూడా ఇవ్వకపోవడంతో నెరవేరని లక్ష్యం
- ఫండ్స్ రిలీజ్ చేసినా వినియోగించని వైనం
పెద్దపల్లి, వెలుగు: ప్రైమరీ, అప్పర్ ప్రైమరీ స్కూల్ విద్యార్థులు ప్రైవేట్ వైపు వెళ్లకుండా ప్రభుత్వ హైస్కూళ్లలోనే చేరేలా అవగాహన కల్పించేందుకు తీసుకొచ్చిన ట్విన్నింగ్ ప్రోగ్రాం తూతూమంత్రంగా నడుస్తోంది. రానున్న విద్యాసంవత్సరంలో సర్కార్ బడుల్లో విద్యార్థుల సంఖ్యను పెంచేందుకు టీచర్లు కృషి చేయాలని ప్రభుత్వం సూచించింది. దీనికోసం సర్కార్ నిధులను కూడా కేటాయించి రిలీజ్ చేసింది. ఆయా స్కూల్స్ టీచర్లకు, సెక్టోరల్అధికారులకు ఈ ప్రోగ్రాంపై సరైన శిక్షణ ఇవ్వకపోవడంతో అవగాహన లేకుండానే నిర్వహిస్తున్నారన్న ఆరోపణలున్నాయి.
స్కూళ్ల మధ్య కమ్యూనికేషన్ పెంచేందుకు..
ప్రైమరీ, అప్పర్ ప్రైమరీ స్కూళ్లమధ్య కమ్యూనికేషన్పెంచడానికి ప్రభుత్వం ట్విన్నింగ్ ప్రోగ్రామ్ ప్రారంభించింది. ఈ ప్రోగ్రామ్ లో భాగంగా ప్రైమరీ స్కూళ్లలో చదువుతున్న 5వ తరగతి విద్యార్థులను అప్పర్ప్రైమరీ స్కూల్ లో చేర్చే ప్లాన్ చేస్తున్నారు. దాని కోసం ప్రైమరీ స్కూల్విద్యార్థులందరినీ అప్పర్ ప్రైమరీ స్కూల్ ను విజిట్ చేయించి, ఆయా అప్పర్ ప్రైమరీల్లో ఉన్న ప్రాక్టికల్ల్యాబ్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, లైబ్రరీ, గేమ్స్అండ్స్పోర్ట్స్ఫెసిలిటీస్ ఎలా ఉన్నయో విద్యార్థులకు చూపిస్తున్నారు.
అలాగే అప్పర్ ప్రైమరీ స్కూల్ విద్యార్థులు 7వ తరగతి పూర్తి కాగానే చాలావరకు ప్రైవేటు స్కూల్స్ వైపు మొగ్గు చూపుతున్నారు. అలాంటి పరిస్థితి భవిష్యత్ లో ఉండకుండా విద్యార్థులను సర్కార్ హైస్కూల్లోనే చేరేలా ట్విన్నింగ్ ప్రోగ్రాంను డిజైన్ చేశారు. విజిట్కోసం పోయే ప్రతీ విద్యార్థికి రూ.50 కేటాయించారు. విజిట్ చేసే స్కూల్కు రూ.500 కేటాయించారు. కానీ ఆయా అధికారులకు ప్రోగ్రాం మీద అవగాహన లేకపోవడంతో కేవలం అప్పర్ ప్రైమరీ నుంచి 7 వ తరగతి విద్యార్థులను మాత్రం స్కూల్ విజిట్ కు తీసుకెళ్తున్నారు.
ఉమ్మడి జిల్లాలో 238 అప్పర్ ప్రైమరీ స్కూల్స్
ఉమ్మడి జిల్లాలో కరీంనగర్ లో 238 అప్పర్ ప్రైమరీ స్కూల్స్ ఉన్నాయి. ఇందులో కరీంనగర్ జిల్లాలో 76 యూపీఎస్ లు ఉండగా 2,802 మంది విద్యార్థులు చదువుతున్నారు. వారి కోసం 28 విజిటింగ్హైస్కూల్స్సెలెక్ట్ చేసి, నిర్వహణ కోసం రూ. 1,51,110 కేటాయించారు. పెద్దపల్లి జిల్లాలో అప్పర్ ప్రైమరీ స్కూల్స్ 83 ఉండగా.. 4,097 మంది విద్యార్థులు చదువుతున్నారు. విజిటింగ్ హైస్కూల్స్ 41 ఉండగా, నిర్వహణ ఖర్చుల కోసం రూ.2,25,335 కేటాయించారు.
జగిత్యాల జిల్లాలో 84 అప్పర్ ప్రైమరీ స్కూల్స్ఉన్నాయి. ఇందులో విద్యార్థులు 4577 మంది ఉన్నారు. విజిటింగ్ హైస్కూల్స్46 ఉండగా.. నిర్వహణ కోసం రూ. 2,51,735 కేటాయించారు. అలాగే రాజన్న సిరిసిల్ల జిల్లాలో 38 అప్పర్ ప్రైమరీ స్కూల్స్ లో 2,059 మంది విద్యార్థులు ఉన్నారు. విజిటింగ్హైస్కూల్స్21 ఉండగా నిర్వహణ కోసం రూ. 1,13,245 కేటాయించారు. కానీ విద్యార్థులను ఆయా స్కూల్స్ విజిట్చేయించడంలో ఆయా టీచర్లు, అధికారులు ఫెయిల్అవుతున్నారు. ప్రభుత్వం కేటాయించిన నిధులను కూడా సక్రమంగా వినియోగించుకోలేకపోతున్నారు.