
తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసులో ట్విస్ట్..మాజీ మంత్రి హరీష్ రావు పీఎను అరెస్ట్ చేశారు పోలీసులు. చక్రధర్ గౌడ్ ఫోన్ ట్యాప్ చేయడంతో పాటు బెదిరింపులకు పాల్పడిన ఆరోపణలతో హరీష్ రావు పీఏ వంశీకృష్ణతో పాటు సంతోష్ కుమార్, పరశురాములును అదుపులోకి తీసుకున్నారు.
చక్రధర్ గౌడ్ కు బెదిరింపు కాల్స్, మేసేజ్ లు చేస్తూ డబ్బులు వసూలు చేశారని ముగ్గురు నిందితులపై అరోపణలు ఉన్నాయన్నారు. కేసులో ఏ1గా హరీష్ రావు, ఏ2గా రాధాష్ణన్ రావు ఉన్నారు.
వంశీకృష్ణ, సంతోష కుమార్, పరశురాములు కలిసి ఓ రైతు గుర్తింపు కార్డులతో సిమ్ కార్డు కొనుగోలు చేసి బెదిరింపులకు పాల్పడ్డారని, సిద్దిపేట జిల్లాలో చక్రధర్ గౌడ్ ఎలాంటిసామాజిక కార్యక్రమాల్లో పాల్గొనకుండా బెదిరించారని ఆరోపణలు ఉన్నాయి.
గతంలో ఆరోగ్యశ్రీ డిపార్టుమెంట్లో పనిచేస్తూ అవినీతికి పాల్పడినట్టు హరీష్రావు పీఎ వంశీకృష్ణపై ఆరోపణలు ఉన్నాయి. ఈ కేసులో కీలక నిందితుడిగా ఉన్నారు. ఆరోగ్యశాఖ మంత్రి హరీష్ రావు ఉన్నప్పుడు ఆయన పేషీలో వంశీకృష్ణ పనిచేశారు.