- ఇండియాలో బిట్‌కాయిన్‌ను డెవలప్ చేస్తాం
- ఇందుకోసం 500 బిట్ కాయిన్లు ఇస్తా
- ట్విటర్ సీఈఓ జాక్ డోర్సీ ప్రకటన
న్యూఢిల్లీ: క్రిప్టో కరెన్సీ ‘బిట్‌కాయిన్’కు ప్రపంచవ్యాప్తంగా రోజురోజుకూ పాపులారిటీ పెరుగుతున్న సమయంలో, ఇండియా, ఆఫ్రికాలో బిట్‌కాయిన్ డెవలప్మెంట్ కోసం బీట్రస్ట్ను ఏర్పాటు చేస్తామని ట్విటర్ సీఈఓ జాక్ డోర్సీ ప్రకటించారు. ఇంటర్నెట్లో ట్రాన్సాక్షన్లకు బిట్‌కాయిన్‌ను వాడేలా చేస్తామని చెప్పారు. ఇందుకోసం అమెరికా బిజినెస్ మ్యాన్ షాన్ కోరేతో చేతులు కలుపుతున్నట్టుపేర్కొన్నారు. వీళ్లిద్దరూ ట్రస్ట్‌కు 500 బిట్కాయిన్లు ఇస్తారు. టెస్లా చీఫ్ఎలన్ మస్క్‌తోపాటు మాస్టర్‌కార్డ్, పేపాల్ వంటి కంపెనీలు కూడా ఈ క్రిప్టోకరెన్సీ పేమెంట్లను అంగీకరిస్తామని ప్రకటించిన సంగతి తెలిసిందే. తామూ నేషనల్ క్రిప్టోకరెన్సీ తెస్తామని ఇటీవల కేంద్రం ప్రభుత్వం వెల్లడించింది. అయితే తమ బిజినెస్‌ను మొదలుపెట్టడానికి ముగ్గురు బోర్డు మెంబర్లు అవసరమని, ఆసక్తి ఉన్న వాళ్లు తమకు అప్లికేషన్లు అందజేయవచ్చని డోర్సీ కోరారు. బిట్‌కాయిన్‌ను ఇంటర్నెట్ కరెన్సీగా మార్చడమే తమ టార్గెట్ అని ప్రకటించారు. ఈ ట్రస్టుకు తాము ఎలాంటి ఆదేశాలు ఇవ్వబోమని, అదే అన్ని నిర్ణయాలను తీసుకుంటుందని చెప్పారు.
ప్రస్తుతం ఒక్కో బిట్‌కాయిన్ 49,500 డాలర్ల వద్ద ఎక్సేంజీల్లో ట్రేడ్ అవుతోంది. క్రిప్టో కరెన్సీలకు డిమాండ్ పెరుగుతూనే ఉండటంతో చైనా, ఇండియా వంటి దేశాలు కూడా డిజిటల్ కరెన్సీ తీసుకురావడానికి ప్రయత్నాలను మొదలుపెట్టాయి. ఈ బడ్జెట్ సెషన్లోనే ‘క్రిప్టోకరెన్సీ అండ్ రెగ్యులేషన్ ఆఫ్ అఫీషియల్డిజిటల్ కరెన్సీ బిల్ 2021’ను ప్రవేశపెడతామని ఇండియా ప్రకటించింది. దీనివల్ల ఆర్బీఐ డిజిటల్మనీని తీసుకురావడం సాధ్యపడుతుంది. చైనా తన డిజిటల్ యువాన్‌ను టెస్ట్ చేస్తోంది. అయితే బీట్రస్ట్బోర్డుకు మెంబర్లు కావాలని డోర్సీ ప్రకటించగానే, వజీర్ఎక్స్ సీఈఓ నిశ్చల్ శెట్టి, బైనాన్స్ సీఈఓ చాంగ్‌పెంగ్ ఝావో వంటి వారి పేర్లను ట్విటర్ యూజర్లు నామినేట్ చేశారు. రతన్ టాటా అయితే బాగుంటుందని మరికొందరు సూచించారు. ఇండియాలో బిట్‌కాయిన్ వాడకం పెరిగితే ఎకానమీకి ఎంతో మేలు జరుగుతుందని నిశ్చల్ అన్నారు.
బిట్‌కాయిన్‌ను తప్పకుండా కొనండి- జెఫరీస్సీనియర్ ఎగ్జిక్యూటివ్ క్రిస్టఫర్వుడ్
బిట్‌కాయిన్ రేటు తగ్గినప్పుడల్లా దానిని కొంటూనే ఉండాలని జెఫరీస్హెడ్ ఆఫ్ ఈక్విటీ స్ట్రాటజీ క్రిస్టఫర్వుడ్ సూచించారు. ఈ క్రిప్టోకరెన్సీ విలువ మరింత పెరుగుతుందని చెప్పారు. బిట్కాయిన్లు కొనడానికి గోల్డ్‌లో ఆయన తన ఇన్వెస్ట్మెంట్లను తగ్గించుకున్నారు కూడా.