ట్విట్టర్‌ని కొనుగోలు చేశాక ఎలన్ మస్క్ పరాగ్ అగర్వాల్‌ని సీఈఓ పదవి నుంచి తొలగించాడు. తరువాత ట్విట్టర్ డెవలప్మెంట్‌కి సంబంధించి కొత్త కొత్త నిర్ణయాలు తీసుకుంటున్నాడు. అయితే, దానికి బదులుగా ట్విట్టర్ కో ఫౌడర్, మాజీ సీఈఓ జాక్ డోర్సే ట్విట్టర్‌కి బదులుగా కొత్త యాప్‌ని తీసుకురానున్నాడు.
ఆ యాప్‌కి ‘బ్లూ స్కై’ అని పేరు పెట్టాడు. యాప్ ప్రస్తుతానికి బీటా వర్షన్ (టెస్టింగ్ స్టేజ్)లో ఉంది. యాప్‌ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసి త్వరలోనే లాంచ్ చేయనున్నట్టు జాక్ ప్రకటించాడు. బ్లూ స్కై కూడా సోషల్ మీడియా అన్ని ప్రామాణికాలు పాటిస్తుందని, యూజర్ల సెక్యూరిటీకి ప్రాధాన్యం ఇస్తుందని జాక్ డోర్సే చెప్తున్నాడు.