ఎక్స్ (X) డౌన్.. కనిపించని పోస్టులు

ఎక్స్ (X) డౌన్.. కనిపించని పోస్టులు

ప్రపంచ వ్యాప్తంగా ఎక్స్.. (మాజీ ట్విట్టర్ ) కుప్పకూలింది.. ఉదయం నుంచి ఎక్స్ లో పోస్టులు కనిపించటం లేదు.. బ్లాంక్ వస్తుంది.. ప్రొఫైల్ లోకి వెళితే పీపుల్స్ లిస్ట్ చూపిస్తుంది.. మనం చేసిన పోస్టులు కనిపించకపోగా.. అసలు ఎవరి పోస్టులు కనిపించటం లేదు.. పేజీలోని ఏ సెగ్మెంట్ క్లిక్ చేసినా.. పీపుల్స్ ఐడీలు హైలెట్ అవుతున్నాయి.. దీంతో ఎక్స్ యూజర్లు తికమక పడుతున్నారు. చాలా మంది లాగిన్ ప్రాబ్లమ్ అనుకుని.. లాగౌట్ చేసి.. లాగిన్ అవుతున్నారు.. అయినా పోస్టులు కనిపించకపోవటంతో.. కంప్లయింట్స్ రైజ్ చేస్తున్నారు.. ఏ టెక్ ప్రాబ్లమ్ వచ్చినా.. ఎక్స్ లో షేర్ చేసే నెటిజన్లు.. ఇప్పుడు ఎక్స్ ప్రాబ్లమ్ రావటంతో.. పిచ్చెక్కిపోతున్నారు.

డిసెంబర్ 21వ తేదీ దున్కీ, సలార్, ఏపీ సీఎం జగన్, తెలంగాణ అసెంబ్లీ ట్రెండింగ్ లో ఉన్నాయి.. వీటి కోసం సర్చ్ చేస్తున్న ఎక్స్ యూజర్లకు.. అసలు పోస్టులు కనిపించకపోవటంతో కన్ఫ్యూజ్ అవుతున్నారు.

ప్రముఖ మైక్రో బ్లాగింగ్ సైట్ ఎక్స్ సేవల్లో సాంకేతిక లోపం కారణంగా అంతరాయం ఏర్పడింది. ఇది కేవలం భారతదేశంలోనే కాదు.. ప్రపంచ వ్యాప్తంగా ఈ సమస్య తలెత్తింది. దీంతో చాలా మంది ఎక్స్ యూజర్స్.. తమ ఖాతా లాగిన్ అవగానే ఖాళీగా కనిపిస్తోందంటూ ఫిర్యాదులు చేస్తున్నారు. ఏ పోస్టులూ కనిపించడం లేదని అంటున్నారు. దీంతో పాటు ఫాలోయింగ్, ఫర్ యూ, లిస్ట్ పేజీలు కూడా బ్లాంక్ గా కనిపించడంతో యూజర్స్ పలు సోషల్ మీడియా సైట్లలో ప్రాబ్లమ్ ను పంచుకుంటున్నారు.

Ookla ద్వారా Downdetector డిసెంబర్ 21న (IST) ఉదయం 11 గంటల ప్రాంతంలో X (ట్విట్టర్) అంతరాయం గురించి 4వేల 5వందల మంది యూజర్స్ ఫిర్యాదు చేశారు. వారి డేటా ప్రకారం గత 24 గంటల్లో ప్లాట్‌ఫారమ్‌లో లోపాన్ని సూచించే గ్రాఫ్ గరిష్ట స్థాయికి చేరుకుంది. డౌన్‌డెటెక్టర్ అనేది వెబ్‌సైట్‌లలో సమస్యలు మరియు అంతరాయాలను నిజ-సమయ వీక్షణను అందించే ఆన్‌లైన్ ప్లాట్‌ఫారమ్. ఈ క్రమంలోనే పలు సోషల్ మీడియా అకౌంట్లలో Twitter Down, X Down అనే హ్యాష్ ట్యాగ్ లు
ట్రెండింగ్ లో నిలుస్తున్నాయి.