ట్విట్టర్ యూజర్లకు -టెస్లా అధినేత ఎలోన్ మస్క్ గుడ్ న్యూస్ చెప్పారు. ట్విట్టర్ యూజ్ చేసే అందరికీ కాకుండా ట్విట్టర్ బ్లూ సబ్ స్కైబర్స్ కు మాత్రమే ఇది వర్తిస్తుంది. ఎన్నో పరిణామాల మధ్య ట్విట్టర్ లోకి ఎంటీ ఇచ్చిన మస్క్ కీలక మార్పులు చేస్తూ వస్తున్నారు. ఇప్పుడు బ్లూ టిక్ సబ్ స్కైబర్ లు 2 గంటల వరకు నిడివి గల వీడియోలను ఆప్ లోడ్ చేయవచ్చని ఎలాన్ మస్క్ ప్రకటించారు. ట్విట్టర్ బ్లూ సబ్ స్కైబర్ లు ఇప్పుడు రెండు గంటలు లేదా 8జీబీ వరకు ఉన్న వీడియోలు ఆప్ లోడ్ చేయవచ్చని ఎలాన్ మస్క్ గురువారం (మే18న) రాత్రి ప్రకటించారు.
ఇకపై ట్విట్టర్ బ్లూ టిక్ యూజర్లు ఇతర ఫీచర్లతో పాటు ట్వీట్లను ఎడిట్ చేసుకోవచ్చు. ఎక్కువ నిడివి ఉన్న వీడియోలను ఆప్ లోడ్ చేసుకోవచ్చు. అదే నాన్ ట్విట్టర్ బ్లూ సబ్ స్కైబర్ అయితే.. 140 సెకన్ల వీడియో అంటే 2 నిమిషాల 20 సెకన్ల వరకూ వీడియోలు ఆప్ లోడ్ చేయగలరు. ఈ మధ్యే మైక్రోబ్లాగింగ్ ప్లాట్‌ఫారమ్ ట్విట్టర్ బ్లూ పేజీని కూడా మార్చిన విషయం తెలిసిందే. ఎవరైతే డబ్బులు చెల్లిస్తారో వారికి మాత్రమే ట్విట్టర్ లో 2 గంటల నిడివి ఉన్న వీడియోలు ఆప్ లోడ్ చేసే వీలు కల్పించారు.దీని వల్ల 2GB నుండి 8GB వరకూ ఉన్న వీడియోలు ఆప్ లోడ్ చేసుకోవచ్చు.
ఇంతకుముందు.. ఎక్కువ సమయం నిడివి ఉన్న వీడియోలు ఆప్ లోడ్ చేసే అవకాశం లేదు. కానీ, ఇప్పుడు ట్విట్టర్ వినియోగదారుల కోసం ఎలోన్ మస్క్.. ఈ అవకాశం కల్పించారు. iOS అప్లికేషన్ వెర్షన్ నుండి కూడా 8GB వరకూ అప్‌లోడ్ చేయవచ్చు. వీడియో క్వాలిటీ కూడా బాగుంటుందని, వీడియో నాణ్యత1080p వలె ఉంటుందని పేర్కొన్నారు. లాంగ్ వీడియో అప్‌లోడ్ ఫీచర్‌ను గత సంవత్సరం డిసెంబర్ (2022)లో ట్విట్టర్ తీసుకువచ్చింది. లాంగ్ వీడియోలు ఆప్ లోడ్ చేసే కొత్త టెక్నాలజీ కావాలంటూ కొంతకాలంగా వినియోగదారులు కోరుతుండడంతో వారి సలహాలు, సూచనల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారు.